ఏపీ వైపు దూసుకొస్తున్న మరో అల్పపీడనం

హైదరాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాయలసీమ జిల్లాలతోపాటు కోస్తాంధ్రలోని పలు ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వరదల వల్ల జరిగిన నష్టం నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అయితే ఈలోపే మరో అల్పపీడనం ఏపీని భయపెడుతోంది. శ్రీలంకకు ఆగ్నేయ దిశగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతూ తమిళనాడు, ఏపీ కోస్తా తీరజిల్లాల వైపు దూసుకొస్తోంది.

ఈ అల్పపీడన ప్రభావంతో 26, 27, 28వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా తీరప్రాంత జిల్లాలతో పాటు ఉత్తర తమిళనాడు జిల్లాలైన చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురం, తిరువణ్ణామలై, తిరుపత్తూరు, రాణిపేట, వేలూరు జిల్లాల్లోనూ భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ను ప్రకటించారు. అల్పపీడన ప్రభావంతో మన రాష్ట్రంలోనూ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.  

మరిన్ని వార్తల కోసం: 

దేశంలోనే అతిపెద్ద ఎయిర్ పోర్టుకు నేడు శంకుస్థాపన

హైదరాబాద్ లో రూ. 140కి చేరిన టమాట ధర

రన్నింగ్ ట్రైన్ లో స్కూల్ గర్ల్, బోయ్ స్టంట్స్