వారం రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. కాస్త తగ్గుముఖం పడుతున్నాయనుకోగానే.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో అది మరింత బలపడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంత ప్రజలు అలర్ట్ గా ఉండాలిని హెచ్చిరించింది. రాబోయే రెండు రోజులు రాష్ట్రంలో భారీగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో కొన్నిచోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. ఇప్పటికే వారం నుంచి కురుస్తున్న వర్షాలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. చాలా గ్రామాలు ఇప్పటికే వరదల్లో మునిగాయి. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు ఐఎండీ తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశముంది.
For More News..