
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మంత్రి కరోనా బారినపడ్డారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ లో ప్రకటించారు. ఇటీవల మంత్రి కొడాలి నాని కరోనా బారినపడి కోలుకున్న విషయం తెలిసిందే.
తాజాగా మంత్రి మేకపాటి అస్వస్థతకు గురికావడంతో అనుమానంతో పరీక్షలు చేయించుకోగా కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఆయన హోం ఐసొలేషన్ లో ఉంటున్నట్లు ప్రకటించారు. గత కొద్ది రోజులుగా తనతో సన్నిహితంగా మెలిగిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఒకవేళ కరోనా నిర్ధారణ కాకున్నా.. స్వీయ జాగ్రత్తలు పాటించాలని మంత్రి మేకపాటి కోరారు.
I have tested positive for #Covid. Mild symptoms exist.
— Mekapati Goutham Reddy Official (@MekapatiGoutham) January 22, 2022
I have isolated myself at home and those who came in touch with me in last few days, kindly get yourself tested & Stay safe!#MaskUpIndia
ఇవి కూడా చదవండి
వనమా రాఘవేంద్రకు రిమాండ్ పొడిగింపు
ఫేక్ ఛానళ్లు, వెబ్సైట్లపై యూట్యూబ్ కొరడా
IAS, IPS అధికారులకు పదోన్నతి