మట్టి కుస్తీ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది నటి ఐశ్వర్య లక్ష్మీ(Aishwarya Lakshmi). ఇటీవల మణిరత్నం పొన్నియన్ సెల్వన్ తో ఆమెకు మంచి గుర్తింపు లభించింది.
లేటెస్ట్గా దుల్కర్ సల్మాన్‌తో కింగ్ ఆఫ్ కొత్త లో నటించింది ఐశ్వర్య. ఈ సినిమా విడుదలై మరోసారి ఈ ముద్దు గుమ్మ పేరు ట్రెండింగ్‌గా మారింది. గ్యాంగ్‌వార్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో ఐశ్వర్య కనిపించింది కొంతసేపే అయినా ఆకట్టుకునే పాత్రలో మెరిసింది. మాలీవుడ్‌తో పాటుగా తెలుగునాట కూడా బిజీగా మారాలని ఈ బ్యూటీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. మంచి కథ దొరికితే చేయడానికి రెడీ అంటోంది.
తెలుగులో ఎప్పటినుంచో మలయాళీ ముద్దుగుమ్మల హవా నడుస్తోంది. నిత్యామీనన్ మొదలు సంయుక్త మీనన్ వరకు ఎంతో మంది నటీమణులు మాలీవుడ్ నుంచి దిగుమతి అయినవారే. మరి ఐశ్వర్యకు తెలుగు పరిశ్రమ ఏ మేరకు కలసివస్తుందో వేచి చూడాలి.