- 85 ఎకరాల్లో రూ.75 కోట్లతో ఎకో పార్క్ రెడీ
- రూ.75 కోట్లతో కొత్వాల్‌గూడలో నిర్మించిన హెచ్ఎండీఏ
- ఐదు ఎకరాల్లో బర్డ్స్ఏవియరీ నీటి అడుగున
- ఆక్వేరియం టన్నెల్!
- లగ్జరీ వుడెన్ కాటేజెస్ నిర్మాణానికి ప్రతిపాదనలు
- ఈ నెలాఖరులో పార్క్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: సిటీ మరో కొత్త అందాన్ని సంతరించుకుంది. ఇప్పటి వరకూ ఏ పార్కులో లేనివిధంగా అనేక రకాల ప్రత్యేకతలతో.. రూ.75 కోట్లతో 85 ఎకరాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ‘ఎకో పార్క్’ను హెచ్ఎండీఏ అభివృద్ధి చేసింది. జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్‌సాగర్‌ను ఆనుకొని కొత్వాల్‌గూడలో నిర్మించిన ఈ పార్క్ ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ నెలాఖరులోగా పార్క్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రత్యేకతలివీ..
ఈ సరికొత్త పార్కులో 1.50 కి.మీ. పొడవు, 2.4 మీటర్ల వెడల్పుతో బోర్డు వాక్ ఏర్పాటు చేశారు. మధ్యమధ్యలో చిన్నచిన్న బ్రిడ్జిలు, వుడెన్ఫ్లోరింగ్, ప్రపంచంలోని వివిధ రకాల పక్షులతో ఐదు ఎకరాల్లో బర్డ్స్ ఏవియరీని ఒక డోమ్ఆకారంలో నిర్మించారు. ఇది సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
విశాలమైన పార్కింగ్తో పాటు ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్చేసేందుకు164 మీటర్ల పాత్‌వేస్, గెజెబోస్, పర్ గూలాస్, ఓపెన్ఎయిర్థియేటర్అందుబాటులోకి తెచ్చారు. ఇక పిల్లలను ఆకట్టుకునేలా బటర్‌ఫ్లై గార్డెన్, సెన్సరీ పార్క్, రెండు చోట్ల పాండ్స్, బర్డ్స్కేజ్ నిర్మించారు. ఇవే కాకుండా హాస్పిటళ్లు, నర్సరీ రూమ్స్, స్టాఫ్రూమ్స్, ఆఫీసు రూమ్స్నిర్మించారు.
ప్రైవేట్ భాగస్వామ్యంతో మరికొన్ని..
ఎకో పార్కులో ప్రైవేట్‌సంస్థలతో కలిసి మరికొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఆక్వేరియం టన్నెల్ సందర్శకులను మరింత కనువిందు చేయనుంది. నీటి అడుగున టన్నెల్నుంచి జలచరాలను తిలకించేందుకు ఆక్వేరియం టన్నెల్నిర్మించనున్నారు. ఫుడ్‌కోర్టులు, స్టే చేసేందుకు లగ్జరీ వుడెన్కాటేజెస్నిర్మించాలని కూడా ప్రతిపాదించారు.
రెండు స్విమ్మింగ్పూళ్లునిర్మించనున్నారు. అడవుల్లో మాదిరిగా టెంట్స్వేసుకునేందుకు క్యాంపింగ్ టెంట్స్వంటివి త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు వివిధ ప్రైవేట్‌సంస్థలతో చర్చలు జరుపుతున్నారు. మొత్తానికి పండగలు, సెలవు దినాల్లో కుటుంబంతో సహా ఎంజాయ్ చేసేలా ఈ ఎకో పార్కును రూపొందించినట్టు అధికారులు తెలిపారు. ఈ పార్కు అందుబాటులోకి వస్తే సిటీలో ఎకో పార్కు మరో టూరిస్ట్ ప్లేస్‌గా మారుతుందని అంటున్నారు.