కొత్త మండలంగా బండలింగాపూర్

మెట్ పల్లి, వెలుగు : జగిత్యాల జిల్లాలో మరోకొత్త మండలం ఏర్పాటు కానుంది. ఈ మేరకు ప్రభుత్వం   నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జారీ చేసింది. మెట్ పల్లి రెవెన్యూ డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలోని మెట్ పల్లి మండలం బండలింగపూర్ ను పది గ్రామాలను కలిపి మండలం ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు 15 రోజుల పాటు అభ్యంతరాలు, వినతులను పరిశీలించిన అనంతరం తుది నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జారీ చేయనుంది.

ALSOREAD:ఏజెంట్ల మోసాలకు..బలైతున్నరు

 ప్రస్తుతం మెట్ పల్లి మండలంలో 23 గ్రామాలను విభజించి వాటిలో 10 రెవెన్యూ గ్రామాలు బండలింగపూర్, రాజేశ్వర్ రావు పేట, మేడిపల్లి, రామాలచ్చక్కపేట్, విట్టంపేట్, మెట్లచిట్లచిట్టపూర్, జగ్గాసాగర్, రామచంద్రంపెట్, రంగరావుపేట, ఆత్మకూర్ గ్రామాలతో కొత్త మండలం ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేశారు.