- పబ్‌కు తీసుకెళ్లి కాస్ట్లీ లిక్కర్ఆర్డర్ చేసి జారుకుంటున్న అమ్మాయిలు
- బెదిరించి డబుల్ రేట్లు వసూలు చేస్తున్న పబ్ నిర్వాకులు
- మాదాపూర్ మోష్ పబ్ పై చీటింగ్కేసు నమోదు
డేటింగ్ యాప్స్ ద్వారా అబ్బాయిలకు అమ్మాయిలను పరిచయం చేసి పబ్ ఓనర్లు ఫ్రాడ్‌కు పాల్పడుతున్నారు. యువకులను పబ్‌కు రప్పించి ఖరీదైన మద్యం, ఫుడ్ ఆర్డర్ చేయిస్తున్నారు. అమ్మాయి జారుకోగానే.. నిర్వాహకులు యువకులను బెదిరించి డబుల్ రేట్లు వసూలు చేస్తున్నారు.
మాదాపూర్, వెలుగు: హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో మరో కొత్త తరహా ఫ్రాడ్ బయటపడింది. డేటింగ్యాప్స్ద్వారా అబ్బాయికి అమ్మాయిని పరిచయం చేసి పబ్ఓనర్లు ఫ్రాడ్ కు పాల్పడుతున్నారు. డేటింగ్ యాప్ ద్వారా యువకులను పరిచయం చేసుకుంటున్న అమ్మాయిలు..వెంటనే కలుద్దామని వాట్సాప్ మెసెజ్ చేస్తున్నారు. పబ్ కు తీసుకెళ్లి అక్కడ ఖరీదైన మద్యం, ఇతర ఆహార పదార్థాలు ఆర్డర్ చేసి జారుకుంటున్నారు. అమ్మాయిలు వెళ్లగానే.. పబ్ నిర్వాకులు యువకులను బెదిరించి రెండింతల డబ్బులు వసూళు చేస్తూ దోపిడికి పాల్పడుతున్నారు.
ఇలాంటి ఘటన మాదాపూర్ లో చోటుచేసుకుంది. హైదారాబాద్ కు చెందిన యువకుడికి టిండర్యాప్లో ఓ యువతి పరిచయమైంది. మరుసటి రోజు యువకుడిని కలుద్దామని చెప్పిన అమ్మాయి.. హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్‌వద్దకు రావాలని కోరింది. దీంతో యువతిని కలిసేందుకు యువకుడు మెట్రో స్టేషన్‌వద్దకు చేరుకున్నాడు. ఇద్దరు కలిసి అక్కడ కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత మెట్రో స్టేషన్ పక్కనే ఉన్న ఈ గెలేరియా మాల్లోని మోష్ పబ్‌కు వెళ్లారు. పబ్‌లో యువకుడిని మాటల్లోకి దింపిన అమ్మాయి.. అతనితో కాస్ట్లీ మద్యం ఆర్డర్ చేయించింది. అనంతరం అక్కడి నుంచి జారుకుంది. అయితే, పబ్మేనేజ్మెంట్ యువకుడిని బెదిరించి అతని వద్ద నుంచి తాగిన దానికంటే డబుల్ రూ.40,505 బిల్లును వసూళు చేసింది.
మోసపోయినట్లు ఎలా గుర్తించాడంటే..
మోసపోయిన తర్వాత బాధిత యువకుడు గూగుల్‌లో పబ్‌కు సంబంధించిన రివ్యూలను చదివాడు. తనతో పాటు మరికొంత మంది యువకులు ఇదే తరహా చీటింగ్ కు గురైనట్లు గ్రహించాడు. డేటింగ్‌యాప్ ద్వారా అమ్మాయితో అబ్బాయిలను ట్రాప్ చేయించి పబ్మేనేజ్మెంటేచీటింగ్ చేయిస్తున్నదని నిర్ధారించుకున్నాడు. పబ్వసూళు చేసిన బిల్లు పేపర్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
ఇది కాస్తా వైరల్‌గా మారి పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో మాదాపూర్పోలీసులు శుక్రవారం సుమోటోగా కంప్లైంట్ స్వీకరించి, మోష్ పబ్‌పై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పబ్ నిర్వాహకులు, యువతులు కలిసి టిండర్, బంబుల్ వంటి డేటింగ్ యాప్ ద్వారా ఇలా ఫ్రాడ్ కు పాల్పడుతున్నట్లు తెలుస్తున్నది.