
గూగుల్ మ్యాప్స్ మరో కొత్త అప్ డేట్‌ను కస్టమర్ల ముందుకు తీసుకువచ్చింది. మహిళలకు రక్షణగా ఉండటం, ముఖ్యంగా రాత్రిళ్లు ప్రయాణం చేసే వారు క్షేమంగా తమ గమ్యానికి చేరుకునేందుకు, వెలుగు ఎక్కువగా ఉండే వీధులను ముందే గుర్తించి అలర్ట్ చేయనుంది. దీంతో చీకటిగా ఉన్న ప్రాంతాలను గుర్తించి.. అటు వైపుగా వెళ్లకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవచ్చని గూగుల్ చెబుతోంది. లైటింగ్ పేరిట ఈ ఆప్ డేట్‌ను ఎక్స్ డీఏ డెవలపర్స్ అభివృద్ధి చేసిందని.. వీధి టైట్లు వెలుగుతున్న ప్రదేశాలను గుర్తించి, మ్యాప్స్ లో చూపనుంది. లైట్లు ఉన్న వీధులు పసుపు రంగులో కనిపిస్తుంటాయని చెప్పింది. గూగుల్ మ్యాప్స్ బీటావర్షన్‌ను ఆప్ డేట్ చేసుకుని ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చంది. ఈ అప్ డేట్‌ను పైలట్ ప్రాజెక్టుగా ఇండియాలో ప్రారంభించామని.. కస్టమర్ల అభిప్రాయం తెలుసుకున్న తర్వాత వరల్డ్ వైడ్ గా అందుబాటులోకి తెస్తామని గూగుల్ తెలిపింది.