
మరో మహమ్మారి రానుందా?.. కోవిడ్ 19 వైరస్ మాదిరిగా మరో వైరస్ బీభత్సం సృష్టించనుందా? అంటే అవుననే అంటున్నారు చైనా పరిశోధకులు. చైనాను కొత్త వైరస్ వణికిస్తోంది. HKU5-CoV-2 అనే కొత్త గబ్బిల కరోనావైరస్ ను చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు. మాస్కులు ధరించిన రోగులతో నిండిన చైనా ఆసుపత్రుల చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో మరో మహమ్మారి భయాలను పెంచుతోంది.
జంతువుల నుంచి మానవులకు వ్యాపించే కొత్త గబ్బిల కరోనావైరస్‌ను చైనా పరిశోధకులు కనుగొన్నారు. HKU5-CoV-2 వైరస్.. కోవిడ్-19కి కారణమైన SARS-CoV-2 వలె మనుషులకు హాని చేస్తుందని అనుమానిస్తున్నారు. ఇది 2020 సంవత్సరంలో లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న ప్రాణాంతక మహమ్మారిని మించి నష్టం కలిగించే అవకాశం ఉందని అంటున్నారు.
ALSO READ | ఈ–వీసాల జారీని మళ్లీ ప్రారంభించిన ఉక్రెయిన్
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ రిపోర్టు ప్రకారం..గబ్బిలాల కరోనావైరస్ లపై ప్రముఖ వైరాలజిస్ట్ షి జెంగ్లీ నాయకత్వంలో పరిశోధనలు చేశారు. చైనాలో ఫ్లూ లాంటి హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) కేసుల పెరుగుదలతో మరొక కోవిడ్ తరహా మహమ్మారి వస్తుందేమోనని చైనీయుల్లో భయం పెరిగింది.. దీంతో పరిశోధనలు చేపట్టారు. ఈ పరిశోధనల్లో HKU5-CoV-2 వైరస్ గురించి బయటపడింది.
కొత్తవైరస్ HKU5-CoV-2 గురించి..
కొత్తవైరస్ HKU5-CoV-2 మూలంపై స్పష్టత రానప్పటికీ కొన్ని అధ్యయనాలు ఇది గబ్బిలాలలో ఉద్భవించి..జంతువుల ద్వారా మనుషులకు సోకుతుందని సూచిస్తు న్నాయి. ఈ వైరస్ ఊపిరితిత్తులు, పేగు కణజాలలకు సోకుతుందని తేలింది. మనుషులు, గబ్బిలాలు, ఇతర జంతువుల్లో ACE2 గ్రాహకాలకు కూడా సోకుతుందని అంటున్నారు.