ప్రవీణ్​ అంత్యక్రియలకు వెళ్తూ.. యాక్సిడెంట్​లో మరో పాస్టర్ మృతి

ప్రవీణ్​ అంత్యక్రియలకు వెళ్తూ.. యాక్సిడెంట్​లో మరో పాస్టర్ మృతి

ఉప్పల్: పాస్టర్ ప్రవీణ్​పగడాల అంత్యక్రియలకు వెళ్తూ మరో పాస్టర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మాల్ కు చెందిన పాస్టర్ జోసెఫ్(45) తన కుటుంబంతో కలిసి చౌదరి గూడలో పాస్టర్ గా పనిచేస్తున్నాడు. 

గురువారం సికింద్రాబాద్​లో ప్రవీణ్​మృతదేహాన్ని చూడడానికి తన బైక్ పై బయలుదేరాడు. ​ ఈ క్రమంలో ఉప్పల్ మోడ్రన్ బేకరీ వద్ద వెనుక నుంచి అతని నవత ట్రాన్స్​పోర్టు వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఉప్పల్ ఎస్ఐ కోటేశ్వరరావు తెలిపారు.