ఖమ్మం/ కారేపల్లి, వెలుగు: ఖమ్మం జిల్లా చీమలపాడు బీఆర్ఎ స్ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా గుడిసెకు మంటలు అంటుకొని గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో మరొకరు చనిపోయారు. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఐదుగురిలో శుక్రవారం సాయంత్రం వలస కూలీ చిండివారి సందీప్ (36) మృతి చెందినట్టు డాక్టర్లు ప్రకటించారు.
మహారాష్ట్రకు చెందిన సందీప్ నాలుగేండ్ల కింద ఉపాధి కోసం చీమలపాడు వచ్చాడు. మంటలు ఆర్పుతుండగా పేలిన గ్యాస్ సిలిండర్ వేగంగా దూసుకొచ్చి తగలడంతో గాయపడ్డారు. రెండ్రో జుల పాటు మృత్యువుతో పోరాడిన సందీప్ శుక్రవారం సాయంత్రం నిమ్స్‌లో కన్నుమూశాడు. సందీప్‌కు భార్య, మూడేండ్ల కొడుకు ఉన్నారు.
సందీప్ మృతితో చీమలపాడు ఘట నలో చనిపోయిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. తేజావత్ భాస్కర్ (31), అంగోత్ రవికుమార్ (28), కె.శ్రీనివాసరావు (39), నారటి వెంకన్న (48) చికిత్స పొందుతున్నారు.