బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ను కత్తితో పొడిచిన కేసు ఎంతకూ తెగడం లేదు. సైఫ్ ను దారుణంగా పొడిచిన దొంగ ఇప్పటికీ పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ముంబై పోలీసు శాఖ ఏడు టీమ్స్ తో దర్యాప్తు చేస్తోంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ముంబై నగరం అంతా గాలిస్తున్నా దుండగుడు చిక్కడం లేదు.
తాజాగా సైఫ్ ను పొడిచిన దొంగకు సంబంధించి మరో ఫోటో వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మరో ఫోటో బయటకు వచ్చింది. తాజా ఫోటోలో బ్లూ షర్ట్ వేసుకొని సీసీటీవీలో కనిపించాడు. నిందితుడు ముంబైలోని తిరుగుతున్నా.. డౌట్ రాకుండా డ్రెస్ మార్చి, స్టైల్ మార్చి తిరుగుతున్నట్లు తెలుస్తోంది.
సైఫ్ అలీఖాన్ ను పొడిచిన టైమ్ లో వేరే డ్రెస్ లో ఉన్న దుండగుడు మరో డ్రెస్ మార్చి పోలీసుల కళ్లు కప్పి తిరుగడం పోలీసుల దృష్టిలోకి వచ్చింది. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు ప్రకటించారు.
బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ముంబైలో సెలబ్రెటీలకు నిలయమైన బాంద్రాలో ఉన్న తన నివాసంలో సైఫ్ అలీఖాన్‌పై గుర్తు తెలియని నిందితుడు కత్తితో ఎటాక్ చేశాడు. బుధవారం (జవనరి 15) అర్థరాత్రి జరిగిన ఈ ఘటనలో సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు సైఫ్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సైఫ్ అలీఖాన్ ఆరు కత్తి పోట్లకు గురైనట్లు లీలావతి ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్‌పై దాడి వార్తతో బాలీవుడ్ ఒక్కసారిగా షేక్ అయ్యింది.