శంషాబాద్​ ఎయిర్​పోర్టులో మరో పోలీస్​స్టేషన్ ఓపెన్

శంషాబాద్​ ఎయిర్​పోర్టులో మరో పోలీస్​స్టేషన్ ఓపెన్

శంషాబాద్, వెలుగు: శంషాబాద్​ఎయిర్​పోర్టులో కొత్తగా ఏర్పాటు చేసిన రెండో పోలీస్​స్టేషన్​ను సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి శనివారం ప్రారంభించారు. శంషాబాద్​ నుంచి రోజుకు లక్ష మంది జర్నీ చేస్తున్నారని, మరిన్ని సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కొత్త పోలీస్ స్టేషన్ ప్రారంభించామని చెప్పారు. 

ఎయిర్​పోర్టు ఏరియాలో కమర్షియల్, ఎకనామిక్స్ యాక్టివిటీస్ పెరిగాయన్నారు. కొత్త స్టేషన్​లో ఒక ఇన్​స్పెక్టర్, ఇద్దరు ఎస్సైలతో పాటు 20 మంది పోలీస్ సిబ్బంది నిరంతరంగా తమ సేవలు అందిస్తారని చెప్పారు. కొత్త ఔట్ పోస్ట్ నిర్మాణానికి సహకరించిన అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.