- 10 లక్షల నగలు, నగదు అపహరణ
కోదాడ, వెలుగు: కోదాడ పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున మరో దొంగతనం జరిగింది. మెయిన్ రోడ్ లో తాళం వేసి వున్న ఇంట్లో దొంగతనం చేసి సుమారు రూ. 10లక్షల విలువైన నగలు, నగదును ఎత్తుకెళ్ళారు. బాధితుల వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన రఘు కోదాడ సమీపంలోని త్రిపురవరంలో ఇలవేల్పు మొక్కు చెల్లించుకోవడనికి శనివారం రాత్రి ఇంటికి తాళం వేసి వెళ్ళాడు.
ఆదివారం తెల్లవారుజామున అతడి బావమరిది ఇంటికి రాగా ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. అది గమనించి రఘుకు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.