డిసెంబర్ నెలాఖరున చైనాతో ఇండియా చర్చలు

డిసెంబర్ నెలాఖరున చైనాతో ఇండియా చర్చలు
  • చైనా విదేశాంగ మంత్రిని కలవనున్న అజిత్ దోవల్

న్యూఢిల్లీ: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ నెల చివరి వారంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(ఎల్ఏసీ)కి సంబంధించిన వివాదాలపై చర్చించనున్నారు. 2020లో గల్వాన్ లోయలో గొడవల అనంతరం రెండు దేశాల మధ్య ఎల్ఏసీపై ఈ స్థాయి చర్చలు జరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

ఇటీవల కుదిరిన ఒప్పందం మేరకు తూర్పు లడఖ్​లోని ఎల్ఏసీ బార్డర్ పొంటి ఉన్న డెప్సాంగ్, డెమ్​చోక్​ ప్రాంతాల నుంచి ఇరుదేశాలు సైన్యాన్ని ఉపసంహరించుకున్నాయి. ఈ నేపథ్యంలో సుదీర్ఘకాలంగా ఉన్న ఉద్రిక్తతలు, వివాదాలపై కీలక చర్చలు జరిపేందుకు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి నెలాఖరులో భేటీ కానున్నారు.