ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు మరో రూ.వెయ్యి కోట్ల రాయితీ

ఎలక్ట్రానిక్స్  కంపెనీలకు మరో రూ.వెయ్యి కోట్ల రాయితీ
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పీఎల్‌‌ఐ కింద అర్హత పొందిన కంపెనీలకు ఇవ్వనున్న ప్రభుత్వం
  • ఈ సెక్టార్‌‌‌‌లో ఇప్పటికే రూ.2,900 కోట్ల రాయితీలు..

న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ సెక్టార్‌‌‌‌లోని ప్రొడక్షన్ లింక్డ్‌‌ ఇన్సెంటివ్ (పీఎల్‌‌ఐ)  స్కీమ్‌‌ కింద ఉత్పత్తి మొదలుపెట్టి, అర్హత పొందిన కంపెనీలకు  2023–24 లో రూ. వెయ్యి కోట్ల రాయితీలను ప్రభుత్వం ఇవ్వనుంది. దీనికి పీఎల్‌‌ఐ ఎంపవర్డ్ కమిటీ ఆమోదం తెలిపిందని అధికారులు వెల్లడించారు. 14 సెక్టార్లలో పీఎల్‌‌ఐ అమలు చేశాక ఈ ఏడాది జూన్ నాటికి రూ.3,400 కోట్ల రాయితీల కోసం క్లయిమ్స్ వచ్చాయని అన్నారు. ఇందులో  రూ. 2,900 కోట్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపి, డిస్‌‌బర్స్‌‌ చేసిందని చెప్పారు. 

 ‘ఎలక్ట్రానిక్స్ సెక్టార్‌‌‌‌లోని పీఎల్‌‌ఐ స్కీమ్‌‌ కింద రూ.1,000 కోట్ల రాయితీలను ఇవ్వడానికి కమిటీ ఆమోదం తెలిపింది. అర్హులైన కంపెనీలకు ఇవి అందడానికి మరికొంత టైమ్‌‌  పడుతుంది’ అని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పీఎల్‌‌ఐ కింద జరగనున్న మొదటి డిస్‌‌బర్స్‌‌మెంట్ ఇదే కానుంది.  పీఎల్‌‌ఐ స్కీమ్‌‌ను 2021లో ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్‌‌తో సహా ప్రస్తుతం 14 సెక్టార్లలో ఈ స్కీమ్‌‌ అమలవుతోంది.

 వైట్ గూడ్స్ (ఫ్రిజ్‌‌లు వంటి తయారీ), టెక్స్‌‌టైల్స్‌‌, మెడికల్ డివైజ్‌‌ల తయారీ, ఆటోమొబైల్స్‌‌,  స్పెషాలిటీ స్టీల్‌‌, ఫుడ్ ప్రొడక్ట్స్‌‌, సోలార్ పీవీ మాడ్యూల్స్‌‌, అడ్వాన్స్డ్‌‌ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ, డ్రోన్స్‌‌, ఫార్మాస్యూటికల్స్‌‌ సెక్టార్లలో పీఎల్‌‌ఐని అమలు చేస్తున్నారు. ఈ స్కీమ్‌‌ కింద  వివిధ సెక్టార్లలో  ప్రొడక్షన్  స్టార్ట్ చేసే కంపెనీలకు రూ.1.97 లక్షల కోట్ల రాయితీలను ప్రభుత్వం ప్రకటించింది.  

ఈ సెక్టార్లలో బాగా అమలు..

పీఎల్‌‌ఐ కింద పెద్ద మొత్తంలో ఎలక్ట్రానిక్స్ తయారు చేయడానికి  32 కంపెనీలు అర్హత పొందాయి.  ఇందులో మొబైల్ ఫోన్లు, కొన్ని ఎలక్ట్రానిక్ కాంపోనెంట్లు తయారు చేస్తున్న కంపెనీలు కూడా ఉన్నాయి.  పీఎల్‌‌ఐ కింద  రాయితీలను  ఇచ్చేందుకు వివిధ మినిస్ట్రీల డిపార్ట్‌‌మెంట్‌‌లు సమావేశమయ్యాయి. కొన్ని సెక్టార్లలో పీఎల్‌‌ఐ రాయితీల డిస్‌‌బర్స్‌‌మెంట్ తక్కువగా ఉంది. ఇలాంటి సెక్టార్‌‌‌‌లోని కంపెనీలు తమ ప్రొడక్షన్‌‌లో  అర్హత సాధించకపోవడం వలన డిస్‌‌బర్స్‌‌మెంట్స్ తక్కువగా ఉన్నాయి. 

ఇటువంటి సెక్టార్లలో పీఎల్‌‌ఐ అమలు చేస్తున్న సంబంధిత డిపార్ట్‌‌మెంట్‌‌లు ఫ్యూచర్‌‌‌‌లో ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తాయి.  పీఎల్‌‌ఐ స్కీమ్‌‌ ఎలా అమలవుతుందో పరిశీలించడానికి హై లెవెల్ రివ్యూ మీటింగ్ తాజాగా జరిగిందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. రాయితీల పంపిణి వేగంగా జరగాల్సి ఉందని అన్నారు. ప్రస్తుతం పీఎల్ఐ స్కీమ్‌‌ ఎలక్ట్రానిక్స్‌‌ మాన్యుఫాక్చరింగ్‌‌, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్‌‌, వైట్ గూడ్స్ సెక్టార్లలో బాగా అమలవుతుండగా, హై ఎఫీషియెన్సీ సోలార్‌‌‌‌ పీవీ మాడ్యూల్స్‌‌, అడ్వాన్స్డ్‌‌ కెమిస్ట్రీ సెల్‌‌ (ఏసీసీ) బ్యాటరీస్‌‌, టెక్స్‌‌టైల్‌‌ ప్రొడక్షన్‌‌, స్పెషాలిటీ స్టీల్‌‌ సెక్టార్‌‌‌‌లో వీక్‌‌గా ఉంది.