అర్చకులు రంగరాజన్‌పై దాడి కేసులో మరో ఏడుగురు అరెస్టు

అర్చకులు  రంగరాజన్‌పై దాడి కేసులో మరో ఏడుగురు అరెస్టు

మొయినాబాద్ చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు  రంగరాజన్‌పై దాడి కేసులో  మరో ఏడుగురు అరెస్టు చేశారు పోలీసులు.  నిందితులు ఈస్ట్ గోదావరి, భద్రాచలం జిల్లాలకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. దాడి జరిగిన తర్వాత పరారీలో ఉన్న నిందితులలో ఇవాళ (గురువారం 13) ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
 
శుక్రవారం ( ఫిబ్రవరి 9, 2025 ) రాఘవరెడ్డి 20మంది అనుచరులతో కలిసి రంగరాజన్ ఇంటికి వెళ్లి దాడి చేసిన విషయం తెలిసిందే. దాడి జరిగిన తర్వాత ప్రధాన నిందితుడు రాఘవరెడ్డితో పాటు మరికొంత మందిని అరెస్టు చేశారు. దీంతో మిగతా నిందితులు అప్పటి నుంచి పరారీలో ఉన్నారు. నిందితుల కోసం ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు పోలీసులు. 

Also Read :- సినిమా స్టంట్ కాదు.. రియల్ యాక్సిడెంట్

రామ రాజ్య స్థాపనకు మద్ధతు ఇవ్వాలని రాఘవరెడ్డి 20 మంది అనుచరులతో అర్చకులు రంగరాజన్ పై దాడి చేశారు. అడ్డొచ్చిన ఆయన కుమారుడిపై కూడా దాడి చేశారు రాఘవరెడ్డి బ్యాచ్. దీనిపై చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవీ సౌందర్ రాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి కీలక నిందితులను అరెస్టు చేశారు. మిగత నిందితుల కోసం గాలిస్తు్న్నారు.