మళ్లీ ఢమాల్ .. 7 వికెట్ల తేడాతో ఢిల్లీ చేతిలో ఓడిన హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దెబ్బకొట్టిన స్టార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డుప్లెసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

మళ్లీ ఢమాల్  .. 7 వికెట్ల తేడాతో ఢిల్లీ చేతిలో ఓడిన హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దెబ్బకొట్టిన స్టార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డుప్లెసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

దెబ్బకొట్టిన స్టార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డుప్లెసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
అనికేత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెరుపులు వృథా
సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌కు రెండో ఓటమి

విశాఖపట్నం: సన్ రైజర్స్ హైదరాబాద్ మళ్లీ పల్టీ కొట్టింది. మేటి హిట్టర్లంతా తేలిపోవడంతో వరుసగా రెండోసారి ఓడిపోయింది. యంగ్ స్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనికేత్ వర్మ (41బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 74) తన మూడో ఇన్నింగ్స్‌‌‌‌లోనే ఫిఫ్టీతో మెరిసినా మిచెల్ స్టార్క్ (5/34) దెబ్బకు మిగతా వాళ్లు బ్యాట్లెత్తేయడంతో  ఆదివారం వైజాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో చిత్తయింది. తొలుత సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రైజర్స్ 18.4 ఓవర్లలో 163 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే ఆలౌటైంది. అనికేత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు హెన్రిచ్ క్లాసెన్ (19 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 32) రాణించాడు. కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డీసీ 16 ఓవర్లలోనే 166/3 స్కోరు చేసి రెండో విక్టరీ అందుకుంది. ఫా డుప్లెసిస్ (27 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 50) ఫిఫ్టీతో రాణించాడు. అరంగేట్రం బౌలర్ జీషన్ అన్సారీ మూడు వికెట్లు తీశాడు.  కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెస్ట్ బౌలింగ్ చేసిన స్టార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్  ద మ్యాచ్ అవార్డు లభించింది.     

స్టార్క్ దెబ్బ.. అనికేత్ పోరాటం 

గత రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో 286/6, 190/9 స్కోర్లు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి  తీవ్రంగా నిరాశపరిచింది. అనికేత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అద్భుతంగా ఆడినా.. మిగతా బ్యాటర్లు  అనవసర షాట్లతో పెవిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేరారు. టాస్ నెగ్గి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దిగిన  హైదరాబాద్ స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచే తడబడింది. పవర్ ప్లేలో 58 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసినా నాలుగు   వికెట్లు కోల్పోయింది.  ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐదో బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ట్రావిస్ హెడ్ (22) సింగిల్ కోసం పిలిచినప్పుడు ఆలస్యంగా స్పందించిన అభిషేక్ శర్మ (1) క్రీజులోకి వచ్చేలోపే విప్రజ్ నిగమ్ అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్మ్ త్రోతో వికెట్లను పడగొట్టడంతో రైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తొలి దెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో మిచెల్ స్టార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఇషాన్ కిషన్ (2), నితీశ్ కుమార్ రెడ్డి (0)ని పెవిలియన్ చేర్చి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు డబుల్ షాకిచ్చాడు. ట్రావిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెడ్ కూడా ఎక్కువ సేపు నిలవలేదు. స్టార్క్ బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీదుగా ఆడేందుకు ప్రయత్నించి రాహుల్ కు క్యాచ్ ఇవ్వడంతో 37/4తో రైజర్స్ డీలా పడింది. ఈ దశలో అనికేత్ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చక్కదిద్దే బాధ్యతను భుజాలపై వేసుకున్నాడు. అతనికి క్లాసెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సపోర్ట్ ఇచ్చాడు. అక్షర్ వేసిన ఆరో ఓవర్లో అనికేత్ ఇచ్చిన క్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పోరెల్ డ్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. అప్పటికి 6 రన్స్ వద్ద ఉన్న అనికేత్ ఈ చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడు. స్టార్క్ తర్వాతి ఓవర్లోనే 4,6తో ఎదురుదాడి చేశాడు. అక్షర్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఖతర్నాక్ షాట్లతో వరుసగా రెండు సిక్సర్లు కొట్టాడు.  మరో ఎండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్లాసెన్ కూడా దూకుడు చూపెట్టడంతో పది ఓవర్లకే స్కోరు వంద దాటింది. కానీ, మోహిత్ శర్మ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విప్రజ్ పట్టిన సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు క్లాసెన్ ఔటయ్యాడు. దాంతో ఐదో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 77 రన్స్ పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ ముగిసింది. ఆపై స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన వరుస  ఓవర్లలో అభినవ్ మనోహర్ (4), కెప్టెన్  కమిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (2)ను ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడంతో 123/7తో నిలిచిన రైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 150లోపే ఆలౌటయ్యేలా కనిపించింది. ఈ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అనికేత్ మళ్లీ జోరు పెంచాడు. అక్షర్ వేసిన 15వ ఓవర్లో వరుసగా 4, 6, 6తో స్టేడియాన్ని హోరెత్తించాడు. కుల్దీప్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ మరో భారీ సిక్స్ కొట్టిన అతను సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ, తర్వాతి బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే మరో సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ట్రై చేసిన అనికేత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌండ్రీ లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద గాల్లోకి ఎగురుతూ మెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గర్క్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెనుదిరగాల్సి వచ్చింది. మరోసారి బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చిన స్టార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అక్షర్, డుప్లెసిస్ పట్టిన చురుకైన క్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు  హర్షల్ పటేల్ (5),  వియాన్ ముల్డర్ (9) ఔటవ్వడంతో రైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తక్కువ స్కోరుకే ఆలౌటైంది. 

డీసీ అలవోకగా.. 

చిన్న టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డీసీ ఈజీగా ఛేజ్ చేసింది. ఓపెనర్లు డుప్లెసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (38) తొలి వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 81 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోడించి విజయం ఖాయం చేశారు. ఈ ఇద్దరు భిన్నంగా ఆడారు. డుప్లెసిస్ స్టార్టింగ్‌‌ నుంచే దూకుడు చూపెట్టాడు. క్లాసిక్ స్టైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కమిన్స్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్ట్రెయిట్ సిక్స్ కొట్టి మునుపటి ఆటను చూపెట్టాడు. మంచి కాన్ఫిడెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో, పర్ఫెక్ట్ టైమింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో షాట్లు కొట్టగా.. మరో ఎండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండో ఓవర్లోనే భారీ సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొట్టిన మెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గర్క్ తర్వాత  టైమింగ్ కుదరక ఇబ్బంది పడ్డాడు. అయినా స్ట్రయిక్ రొటేట్ చేస్తూ డుప్లెసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సపోర్ట్ ఇచ్చాడు. పేసర్లు షమీ, కమిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు స్పిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభిషేక్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నాణ్యమైన స్ట్రోక్స్‌‌ ఆడిన డుప్లెసిస్ 26 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఆరంగేట్రం లెగ్ స్పిన్నర్ జీషన్ అన్సారీ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వియాన్ ముల్డర్ పట్టిన మంచి క్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు డుప్లెసిస్ ఔటవగా.. అదే ఓవర్లో వరుసగా 4,4,6 కొట్టిన మెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గర్క్ .. జీషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రిటర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చి వెనుదిరిగాడు. వచ్చీరాగానే రెండు ఫోర్లు, సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఊపు మీద కనిపించిన కేఎల్ రాహుల్ (15)ను కూడా జీషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసినా అప్పటికే మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీసీ చేతుల్లోకి వెళ్లింది. ట్రిస్టాన్ స్టబ్స్ (21 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) అభిషేక్ పోరెల్ (18 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 34 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) లాంఛనం ముగించాడు. ముల్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో డీసీని గెలిపించాడు.

సంక్షిప్త స్కోర్లు
సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: 18.4 ఓవర్లలో 163 ఆలౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (అనికేత్ 74, క్లాసెన్ 32, స్టార్క్ 5/35, 
కుల్దీప్ 3/22);
ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: 16 ఓవర్లలో 166/3 (డుప్లెసిస్ 50, మెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గర్క్ 38, 
జీషన్ అన్సారీ 3/42)