కోటాలో మరో స్టూడెంట్‌‌ సూసైడ్‌‌.. మూడు నెలల్లోనే 10 మంది విద్యార్థుల మృతి

కోటాలో మరో స్టూడెంట్‌‌ సూసైడ్‌‌.. మూడు నెలల్లోనే 10 మంది విద్యార్థుల మృతి

కోటా: రాజస్థాన్‌‌లోని కోటాలో మరో స్టూడెంట్‌‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌‌కు చెందిన ఉజ్వల్‌‌ మిశ్రా(18) కోటాలోని రాజీవ్‌‌ గాంధీ నగర్‌‌‌‌లోని హాస్టల్‌‌లో ఉంటూ, ఓ ఇన్‌‌స్టిట్యూట్‌‌లో జేఈఈ మెయిన్‌‌ కోసం కోచింగ్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం (March 30) సాయంత్రం హాస్టల్‌‌ నుంచి ఉజ్వల్‌‌ నేరుగా కోటా రైల్వే స్టేషన్‌‌కు చేరుకున్నాడు. 7 గంటల సమయంలో స్టేషన్‌‌లోకి ఓ ట్రైన్ వస్తుండగా, ఎదురెళ్లి సూసైడ్‌‌ చేసుకున్నాడు. 

ఆ స్టూడెంట్‌‌ అకస్మాత్తుగా పట్టాల మీదికి వచ్చాడని, ఆ సమయంలో ట్రైన్‌‌ చాలా వేగంతో వెళ్తున్నదని రైలు లోకోపైలెట్‌‌ తెలిపాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, డెడ్‌‌బాడీని పోస్ట్‌‌ మార్టం కోసం స్థానిక ప్రభుత్వ హాస్పిటల్‌‌కు తరలించారు. 

స్టూడెంట్‌‌ ఆత్మహత్య విషయాన్ని వారి తల్లిదండ్రులకు చెప్పామని పోలీసులు తెలిపారు. కాగా, కోటాలో ఈ ఏడాదిలో ఇప్పటివరకు 10 మంది విద్యార్థులు సూసైడ్‌‌ చేసుకున్నారు.