
పరిగి, వెలుగు: ఓ గవర్నమెంట్ స్కూల్ టీచర్ సంతకం ఫోర్జరీ చేసి, లోన్ తీసుకున్న మరో టీచర్‌పై నల్లకుంట పీఎస్‌లో కేసు నమోదైంది. ఫోర్జరీ సంతకాన్ని గ్యారంటీగా పెట్టుకొని, లోన్ఇచ్చిన కపిల్ చిట్‌ఫండ్స్13 మంది డైరెక్టర్లు, అసిస్టెంట్ మేనేజర్‌పై కూడా కేసు నమోదు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా పరిగి మండలం సోండేపూర్ తండాకు చెందిన నేనావత్ లక్ష్మణ్, కులక్చర్ల మండలం పొట్టి గడ్డ తండాకు చెందిన విస్లావత్ రాములు బంధువులు.
లక్ష్మణ్ ప్రస్తుతం హైతాబాద్ జడ్పీహెచ్ఎస్లో, రాములు కోకాపేట ఎంపీహెచ్ఎస్లో టీచర్లుగా పనిచేస్తున్నారు. లక్ష్మణ్‌తో చేపల చెరువు బిజినెస్ చేద్దామని, తన వ్యక్తిగత వివరాలను రాములు తీసుకున్నాడు. ఆ తర్వాత కపిల్ చిట్‌ఫండ్స్‌లో లక్ష్మణ్ ఎంప్లాయ్ ఐడీ, తప్పుడు సిగ్నేచర్‌ను గ్యారంటీగా పెట్టి లోన్తీసుకున్నాడు. కొద్ది కాలం తర్వాత 2024 నవంబర్‌లో కపిల్ చిట్ ఫండ్స్ నుంచి రూ.21 లక్షలు చెల్లించాలని లక్ష్మణ్‌కు నోటీసులు రావడంతో షాకయ్యాడు.
సిబిల్ స్కోర్ పడిపోతుందేమోనన్న భయంతో ఆరు నెలలపాటు మొత్తం రూ 96,126 చెల్లించాడు. ఆ తర్వాత విస్లావత్ రాములు లోన్ తీసుకున్న ఏరియా గురించి విచారించగా, శంకర్‌మఠ్ కపిల్ చిట్ ఫండ్ బ్రాంచ్ గా తెలిసింది. ఈ ఘటనపై ఫిర్యాదు చేస్తే నల్లకుంట పోలీసులు పట్టించుకోలేదని బాధితుడు ఆరోపించాడు. దీంతో నాంపల్లి క్రిమినల్ కోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆదేశాలతో రాములతోపాటు కపిల్ చిట్‌ఫండ్స్ 13 మంది డైరెక్టర్లు, అసిస్టెంట్ మేనేజర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.