మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr) ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమా దేవర (Devara). స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ ఆ అంచనాలను మరింత రెట్టింపు చేసింది. దీంతో ఈ సినిమా నుంచి రాబోయే ప్రతి అప్డేట్ పై ఫ్యాన్స్ తమ ఇంట్రెస్ట్ ను చూపిస్తున్నారు.
ఈ సినిమా సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుండగా..తాజాగా దేవర టీమ్ నుంచి క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. దేవర మూవీ నుంచి ఇంకో ట్రైలర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు రూమర్లు బయటికి వచ్చాయి. ఈ కొత్త ట్రైలర్ సినిమా రిలీజ్ కు ముందే తీసుకొస్తున్నట్లు సమాచారం.
అయితే, ప్రస్తుతం ట్రెండ్ అవుతోన్న ట్రైలర్ పట్ల ఓ 70 శాతం మేరకు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ మాస్ యాక్షన్, కొన్ని సీక్వెన్సులు, డైలాగ్స్ అదిరిపోయాయంటూ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
అయితే, కొందరు మాత్రం ట్రైలర్ అంత ఎక్కలేదని..మ్యూజిక్, కొన్ని ఫ్రేమ్‍లు, వీఎఫ్‍ఎక్స్ విషయాల్లో కాస్త విమర్శలు వచ్చాయి. దీంతో ఫ్యాన్స్ అసంతృప్తిని గమనించిన మేకర్స్..ఈ సారి అదిరిపోయే ట్రైలర్ తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారట.అందరికీ నచ్చేలా ఈ ట్రైలర్ ఉంటుందని సమాచారం.
Also Read : మరోసారి విలన్‌గా సూర్య
ఇకపోతే..ఈ కొత్త ట్రైలర్ను దేవర ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈవెంట్‍ను సెప్టెంబర్ 22వ తేదీన హైదరాబాద్‍లో నిర్వహించాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రేజీ అప్డేట్తో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. త్వరలో ఈ ట్రైలర్ అప్డేట్ పై మేకర్స్ నుంచి అనౌన్స్ వచ్చే అవకాశం ఉంది.
దేవర సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ మూవీకి సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికేట్ ఇచ్చింది. 2 గంటల 58 నిమిషాలు (178 నిమిషాలు) రన్‌టైమ్‌ను సెన్సార్ ఆమోదించింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ సభ్యులు U/A సర్టిఫికెట్‌ను ఇవ్వడంతో పాటు, సినిమా బాగుందని ఆఫ్ ది రికార్డ్ యూనిట్ సభ్యులతో అన్నారంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.