రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముచ్చుమర్రి బాలిక హత్య కేసులో నిందితుడు హుస్సేన్ మరణం కలకలం రేపింది. హుస్సేన్ పోలీసుల విచారణలో మరణించటంతో లాకప్ డెత్ అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శనివారం ( జూలై 21, 2024 ) నాడు జరిగిన ఈ ఘటనపై నంద్యాల పోలీసులు క్లారిటీ ఇచ్చారు. విచారణ సమయంలో నిందితుడు తప్పించుకునే ప్రయత్నం చేశాడని తెలిపారు పోలీసులు.
పోలీసుల నుండి తప్పించుకునే క్రమంలో అనారోగ్యానికి గురై నిందితుడు చనిపోయాడని వెల్లడించారు. నంద్యాల శివారులోని `మసీదుపురం మెట్ట నుండి నందికొట్కూరు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో హుస్సేన్ తప్పించుకునే ప్రయత్నం చేసాడని.. పోలీసులు వెంటాడి పట్టుకున్నారని తెలిపారు. ఆ సమయంలో ఛాతిలో నొప్పి ఉందని చెప్పటంతో వెంటనే నంద్యాల ఆసుపత్రికి తరలించగా మరణించాడని తెలిపారు పోలీసులు.
హుస్సేన్ గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు బంధువులు తెలిపారని వెల్లడించారు పోలీసులు. బాలిక మృతదేహాన్ని మాయం చేయడంలో కీలక పాత్ర పోషించిన బాలుడి మేనమామ హుస్సేన్ మరణం ఈ కేసులో కీలకంగా మారింది.