భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ జంట విడిపోయిన విషయం తెలిసిందే. 13 ఏళ్ల వీరి దాంపత్య జీవితం వారం రోజుల కిందటే విచ్చిన్నమైంది. షరియా చట్టాల ప్రకారం సానియాకు విడాకులిచ్చిన మాలిక్.. పాకిస్తానీ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు. ఇది వారం రోజుల క్రితం జరిగిన సంఘటన. మరి ఇప్పుడేంటి..? అంటారా..! వీరి విడాకుల సంగతేమో కానీ, నెటిజెన్స్ మరో వ్యక్తి పేరు తెరమీదకు తెస్తూ అతని పరువును బజారు కీడుస్తున్నారు.
పెళ్లికి ముందు సోహ్రాబ్‌తో నిశ్చితార్థం
షోయబ్ మాలిక్‌తో వివాహానికి ముందు సానియా మీర్జాకు తన చిన్ననాటి స్నేహితుడైన సోహ్రాబ్ మీర్జాతో నిశ్చితార్థం అయ్యింది. ఇరు కుటుంబాల అంగీకారంతోనే ఇది జరిగింది. అయితే, పెళ్లికి కొద్దిరోజుల సమయం ఉందనంగా సానియా.. మాలిక్‌తో ప్రేమలో పడి, సోహ్రాబ్‌తో తన నిశ్చితార్థాన్ని విరమించుకుంది. అనంతరం కుటుంబసభ్యులను ఒప్పించి మాలిక్‌ను పెళ్లాడింది. దీంతో నెటిజెన్స్.. సోహ్రాబ్ మీర్జాను తెరమీదకు తెస్తున్నారు. ఇతన్ని చేసుకొని ఉంటే టెన్నిస్ స్టార్ జీవితం ఇలా అయ్యేది కాదంటూ పరోక్షంగా కామెంట్లు చేస్తున్నారు. సోహ్రాబ్‌తో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నప్పటికీ, వారి కుటుంబాలు ఇప్పటికీ సన్నిహితంగా ఉన్నాయి.
కాగా, సానియా మీర్జా, షోయబ్ మాలిక్ 2010, ఏప్రిల్ 12న వివాహం చేసుకున్నారు. హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్‌లో హైదరాబాదీ ముస్లిం సంప్రదాయ వేడుకలో వీరి వివాహం జరిగింది. ఈ జంటకు ఇజాన్ అనే కుమారుడు ఉన్నాడు.
- Alhamdullilah ♥️
— Shoaib Malik ?? (@realshoaibmalik) January 20, 2024
"And We created you in pairs" وَخَلَقْنَاكُمْ أَزْوَاجًا pic.twitter.com/nPzKYYvTcV