స్టార్ హీరో సినిమా అనగానే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కోరుకుంటారు ఫ్యాన్స్. మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా అవన్నీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ‘సర్కారువారి పాట’ నుంచి వస్తున్న ఒక్కో అప్‌డేట్ చూస్తుంటే.. అభిమానులను అలరించే విజువల్ ఫీస్ట్ రెడీ అవుతున్నట్టే అనిపిస్తోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్ అంటూ రకరకాలుగా సినీ లవర్స్‌ని ఆకట్టుకున్న టీమ్.. ఉగాది కానుకగా ఓ యాక్షన్ ప్యాక్డ్ పోస్టర్‌ని వదిలింది.
ఇది చూస్తే ఫ్యాన్స్ జోష్ డబుల్ అయిపోవడం ఖాయం. ఇదో ఫైట్ సీన్‌కి సంబంధించిన స్టిల్. రౌడీలు మహేష్‌ని చుట్టుముట్టి ఉన్నారు. వారి తాట తీసేందుకు గాను మెల్లగా బెల్ట్ విప్పుతున్నాడు మహేష్. దొరికారో అయి పోయారే అన్నట్టుగా ఉంది అతని చూపు. త్వరలో ఇంతకు మించిన ఇంటరెస్టింగ్ అప్‌డేట్స్ మరిన్ని రాబోతున్నాయని చెబుతున్నారు మేకర్స్. ఆల్రెడీ మ్యూజికల్ ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ప్రస్తుతం బ్యాగ్రౌండ్ స్కోర్ చేసే పనిలో ఉన్న తమన్.. త్వరలో మరో పాట రాబోతోందని చెబుతున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ సంస్థలతో కలిసి మహేష్ బాబు నిర్మిస్తున్నాడు. మే 12న సినిమా విడుదల.