యూఎస్‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌: 24వ టైటిల్ దిశగా జొకోవిచ్ మరో అడుగు ముందుకు

యూఎస్‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌: 24వ టైటిల్ దిశగా జొకోవిచ్ మరో అడుగు ముందుకు

న్యూయార్క్‌: సెర్బియా సూపర్‌‌ స్టార్‌‌ నొవాక్‌‌‌‌‌‌‌‌‌‌ జొకోవిచ్‌‌‌‌.. 25వ గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌స్లామ్‌‌‌‌ వేటలో మరో అడుగు ముందుకేశాడు. యూఎస్‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌లో భాగంగా బుధవారం అర్ధరాత్రి జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌రెండో రౌండ్‌లో రెండో సీడ్‌‌‌‌‌‌‌‌‌ జొకోవిచ్‌ 6–4, 6–4, 2–0తో లాస్లో డిజెరె (సెర్బియా)పై గెలిచాడు. దీంతో యూఎస్‌‌‌‌‌ ఓపెన్‌‌లో 90వ విజయాన్ని ఖాతాలో వేసుకున్న జొకో.. నాలుగు గ్రాండ్‌‌‌‌స్లామ్స్‌లోనూ ఇన్నే  విజయాలు సాధించిన తొలి ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. 2 గంటలా 16 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో ఆరంభంలో జొకో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తొలి సెట్‌లో సర్వీస్‌లు కొట్టడంలో ఫెయిలయ్యాడు. పారిస్‌‌‌‌‌ఒలింత ఆడుపిక్స్‌‌తర్వాతున్న తొలి టోర్నీ కావడంతో  ఫిట్‌నెస్‌‌‌‌సమస్యలను ఎదుర్కొన్నాడు. 

దీంతో తొలి సెట్‌లో 47 శాతం మాత్రమే సర్వీస్‌లు సాధించాడు. అయినా 62 నిమిషాల్లో తొలి సెట్‌ను గెలిచి లీడ్‌లోకి వచ్చాడు. కానీ రెండో సెట్‌లో డిజెరె నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. రెండుసార్లు జొకో సర్వీస్‌‌‌లను బ్రేక్‌ చేసిన డిజెరె 4–2, 5–2 లీడ్‌లో నిలిచాడు. ఈ సెట్‌‌లో జొకోకు ఓటమి తప్పదేమో అనుకున్న టైమ్‌‌‌లో డిజెరె అనూహ్యంగా నడుం నొప్పికి గురయ్యాడు. ఫిజియోతో చికిత్స తీసుకుని మ్యాచ్‌ను కొనసాగించినా సెట్‌ను గెలవలేకపోయాడు. మూడో సెట్‌లో రెండు గేమ్‌‌‌‌ల తర్వాత నొప్పి ఎక్కువ కావడంతో డిజెరె మ్యాచ్‌ నుంచి తప్పుకున్నాడు. 

ఇతర మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జ్వెరెవ్‌‌‌‌(జర్మనీ) 6–4, 7–6 (7/5), 6–1తో అలెగ్జాండర్‌‌‌‌‌‌ ముల్లర్‌‌ (ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌)పై, ఆరో సీడ్‌‌‌‌‌‌‌‌ రబ్లెవ్‌ (రష్యా) 4–6, 5–7, 6–1, 6–2, 6–2తో రిండర్‌‌‌‌‌‌‌‌ కెంచ్‌‌‌‌‌‌‌‌(ఫ్రాన్స్‌‌‌‌)పై, 8వ సీడ్‌ కాస్పర్‌‌‌‌‌‌‌‌‌ రుడ్‌‌‌‌‌‌‌(నార్వే) 6–4, 6–2, 2–6, 7–6 (7/3)తో  గేల్‌‌‌‌‌‌‌‌మోన్‌‌‌‌‌‌‌‌‌ఫిల్స్‌‌‌‌‌‌‌‌ (ఫ్రాన్స్‌‌‌)పై, 9వ సీడ్‌‌‌‌‌ దిమిత్రోవ్‌‌‌‌‌‌‌ (రష్యా) 6–1, 6–1, 7–6 (7/4)తో హిజికటా (ఆస్ట్రేలియా)పై, 12వ సీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టేలర్‌‌‌‌‌‌‌‌‌ఫ్రిట్జ్‌‌‌‌‌‌‌ (అమెరికా) 6–3, 7–6 (7/1), 6–1తో బెరెటినీ (ఇటలీ)పై, 13వ సీడ్‌‌‌‌‌ షెల్టన్‌‌‌‌‌‌(అమెరికా) 6–3, 6–4, 6–4తో బటిస్టా అగుట్‌‌‌‌‌‌(స్పెయిన్‌‌‌‌‌‌‌)పై, 20వ సీడ్‌‌‌‌‌ ఫ్రాన్సెస్‌‌‌‌‌‌ తియాఫో (అమెరికా) 6–4, 6–1, 1–0తో అలెగ్జాండర్‌‌‌‌‌‌ షివ్‌‌‌‌‌‌‌‌‌ చెంకో (కజకిస్తాన్‌‌‌‌‌)పై నెగ్గి మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు. 

సబలెంక జోరు..

విమెన్స్‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌లో  సీడెడ్‌‌‌‌‌ ప్లేయర్లు సాఫీగా ముందుకెళ్లారు. రెండో సీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అరీనా సబలెంక (బెలారస్‌‌‌‌‌) 6–3, 6–1తో లూసియా బ్రోంజెటి (ఇటలీ)పై నెగ్గి తదుపరి రౌండ్‌లోకి అడుగుపెట్టింది. గంట పాటు జరిగిన మ్యాచ్‌లో సబలెంక సర్వీస్‌లతో హోరెత్తించింది. మ్యాచ్​ మొత్తంలో 5 ఏస్‌‌లు, ఒక డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫాల్ట్‌‌ చేసిన సబలెంక ఎనిమిది బ్రేక్‌ పాయింట్లలో నాలుగింటిని కాచుకుంది. 24 విన్నర్స్‌‌, 17 అన్‌‌‌‌‌ఫోర్స్‌డ్‌‌‌‌‌‌‌ ఎర్రర్స్‌ చేసింది. 2 ఏస్‌లు, 3 డబుల్‌ ఫాల్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన బ్రోంజెటీ ఒక్క బ్రేక్‌‌‌‌‌ పాయింట్‌ను కూడా సాధించలేదు. 9 విన్నర్స్‌‌‌, 11 అన్‌‌‌‌‌‌ఫోర్స్‌డ్‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎర్రర్స్‌తో మూల్యం చెల్లించుకుంది. ఇతర మ్యాచ్‌ల్లో మూడో సీడ్‌‌‌‌‌‌‌‌ కోకో గాఫ్‌‌‌(అమెరికా) 6–4, 6–0తో తట్జానా మరియా (జర్మనీ)పై, ఏడో సీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌ జెంగ్‌ (చైనా) 6–7 (3/7), 6–1, 6–2తో ఆండ్రీవా (రష్యా)పై, 13వ సీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నవారో (అమెరికా) 6–1, 6–1తో రుస్‌ (నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌)పై, 20వ సీడ్‌‌‌‌‌‌ విక్టోరియా అజరెంక (బెలారస్‌‌‌‌) 6–1, 6–4తో బురెల్‌ (ఫ్రాన్స్‌‌‌‌‌)పై, స్వితోలినా (ఉక్రెయిన్‌‌‌‌‌‌‌) 6–1, 6–2తో కలినినా (ఉక్రెయిన్‌‌)పై గెలిచి ముందంజ వేశారు.