
- చైనాలో మరో వైరస్ కనుగొన్న సైంటిస్టులు
బీజింగ్: చైనాలో కరోనా లాంటి మరో కొత్త వైరస్ ను ఆ దేశ సైంటిస్టులు కనుగొన్నారు. గబ్బిలాల్లో కనుగొన్న ఈ వైరస్ జంతువుల ద్వారా మనుషులకు సోకుతున్నట్లు గుర్తించారు. ఈ వైరస్ కు హెచ్ కేయూ5 కోవ్ 2గా పేరు పెట్టారు. కొవిడ్ 19కు కారణమయ్యే సార్స్ కోవ్ 2ను ఈ వైరస్ పోలి ఉందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది.
గబ్బిలాల్లో కరోనా వైరస్ లపై పరిశోధనలతో ‘బ్యాట్ ఉమన్’ గా పేరు పొందిన వైరాలజిస్ట్ షీ ఝెంగ్లి నేతృత్వంలోని టీం ఓ గబ్బిలంలో ఈ కొత్త వైరస్ ను కనుగొన్నది. ప్రస్తుతం చైనాలో ఫ్లూ లాంటి హెచ్ఎంపీవీ వైరస్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో కరోనా విపత్తులాగే మరో మహమ్మారి విజృంభిస్తుందేమో అని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.