ఏడుగురిని పొట్టునబెట్టుకున్న మరో తోడేలు పట్టివేత

ఏడుగురిని పొట్టునబెట్టుకున్న మరో తోడేలు పట్టివేత

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌‌‌‌ బహ్రైచ్ జిల్లాలో మెహాసి తెహ్‌‌‌‌సిల్‌‎లో ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్‌‌‌‌ భేడియా’లో మరో విజయం లభించింది. ఈ గుంపులోని నాలుగో తోడేలును అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. అనంతరం దానికి ట్రాంక్విలైజర్ ఇచ్చి గోరఖ్​పూర్ జూకు తరలించారు. ఈ తోడేలు రెండు నెలల వ్యవధిలో కనీసం ఏడుగురు పిల్లలను పొట్టనపెట్టుకొంది. బుధవారం రాత్రి 11 గంటలకు థర్మల్ ఇమేజింగ్ డ్రోన్ ద్వారా తోడేలును తొలిసారిగా గుర్తించారు.

 తెల్లవారుజామున 5 గంటలకు మరోసారి డ్రోన్‌‎ను ఉపయోగించి దానిని కన్ఫార్మ్ చేసుకున్నారు. తోడేలు పాదముద్రలు లభించడంతో అధికారులు రంగంలోకి దిగారు. గురువారం ఉదయం 10.45 గంటలకు సీసయ్య గ్రామంలో దానిని విజయవంతంగా పట్టుకున్నారు. ఈ తోడేలు దాదాపు 35 గ్రామాల్లోని ప్రజలను భయ భ్రాంతులకు గురిచేసింది. దీనిని పట్టుకోవడంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.