రియాక్టర్ పేలిన ఘటనలో.. మరో కార్మికుడు మృతి

జీడిమెట్ల, వెలుగు : రియాక్టర్​ పేలిన ఘటనలో మరో కార్మికుడు మృతి చెందాడు. ఈ నెల 21న హైదరాబాద్ జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా ఫేజ్​-–4లో ఉన్న అరోర్​ ఫార్మాస్యుటికల్​ఫ్యాక్టరీలో రియాక్టర్​ పేలి అనిల్​కుమార్​యాదవ్ చనిపోయాడు. మరో ముగ్గురు కార్మికులు శ్రీనివాస్​రెడ్డి, బలరాం, గోపిచంద్ ​తీవ్రంగా గాయపడ్డారు.

 వీరిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ బలరాం(51)  శనివారం రాత్రి చనిపోయాడు. ఏపీలోని విజయనగరం నుంచి అతను ఉపాధి కోసం సిటీకి వచ్చి సూరారంకాలనీ జీవన్​జ్యోతినగర్​లో ఉంటూ అరోర్​ఫార్మా  కంపెనీలో పనిచేస్తున్నాడు. చికిత్స పొందుతున్న శ్రీనివాస్​రెడ్డి, గోపిచంద్​పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం.