పెట్రోల్ బంక్లో పనిచేస్తూ బెట్టింగ్కు అలవాటు.. నిజామాబాద్ జిల్లాలో మరో యువకుడు బలి

పెట్రోల్ బంక్లో పనిచేస్తూ బెట్టింగ్కు అలవాటు.. నిజామాబాద్ జిల్లాలో మరో యువకుడు బలి

ఈజీ మనీ కోసం బెట్టింగ్స్ ఆడుతూ లైఫ్ ను రిస్క్ లో పెట్టుకుంటున్నార యువకులు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. అవగాహన కార్యక్రమాలు చేపట్టినా తొందరగా లక్షాధికారి కావాలనో.. తొందరగా సమస్యలు తీరాలనో కానీ.. యువత బెట్టింగ్ మహమ్మారికి బలవుతూనే ఉన్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో బెట్టింగ్ యాప్స్ లో నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది.

వివరాళ్లోకి వెళ్తే.. ఆకుల కొండూరులో ఆకాష్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. ఘటన జరిగిన వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.  ఆకాశ్ గడ్డిమందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేయడంతో స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం మిగిలింది.

ఆకాశ్ జీవనోపాధి కోసం పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నాడు. ఫ్రెండ్స్ ద్వారా బెట్టింగ్ యాప్స్ గురించి తెలుసుకుని గత కొన్నాళ్లుగా ఆడుతున్నాడు. ఈ క్రమంలో ఇటీవలే 5 లక్షల రూపాయల వరకు పోగొట్టుకున్నాడు.  బెట్టింగ్ లో డబ్బులు పోయాయని తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూనే మృతి చెందడంతో కొడూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి.