గార్బా డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలిపోయాడు.. గుజరాత్లో అసలేం జరుగుతుంది

దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన గార్బా డ్యాన్స్‌ లో పాల్గొన్న ఓ యువకుడు గుండెపోటుతో మరణించాడు. బాధితతుడు రోహిత్ గార్బా  డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే  కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 

రోహిత్‌ మృతి ఒక్కటేమీ కాదు. గుజరాత్‌లో గత కొన్ని రోజులుగా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గర్బాలో పాల్గొంటూ పలువురు గుండెపోటుతో మృత్యువాత పడుుతుండటం ఆందోళన కలిగిస్తుంది.  బాధితుల్లో ఎక్కువగా యువకులే ఉన్నారు. పెరుగుతున్న మరణాల సంఖ్యను గమనించి, రాష్ట్ర ప్రభుత్వం గార్బా వేదికల సమీపంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను హై అలర్ట్‌గా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. 

అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు ఈవెంట్‌లలోకి వేగంగా ప్రవేశించేందుకు కారిడార్‌లను రూపొందించాలని గార్బా నిర్వాహకులను ఆదేశించింది.  ఈ న‌వ‌రాత్రుల సంద‌ర్భంగా గ‌డిచిన ఆరు రోజుల్లో గుజ‌రాత్ వంటి ప్రదేశాల్లో 108 అంబులెన్స్ సర్వీసులకు గుండె సంబంధిత సమస్యలకు సంబంధించి 1000 కాల్స్ వ‌చ్చాయ‌ని ప్రభుత్వం తెలిపింది.

ALSO READ : తీన్మార్| దసరా వేడుకలు | TS ఎన్నికలు 2023 | ఆంధ్రా సెటిలర్లు-మద్దతు | దుర్గా మాత-కరెన్సీ | 24/10/2023