లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలి

లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. కొత్తగూడని చెందిన శీలం మనోజ్ అనే యువకుడు దుండిగల్ ఎరోనాటిక్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఇటీవల లోన్ యాప్ ద్వారా మనోజ్ లోన్ తీసుకున్నాడు. కొన్ని ఈఎంఐలు కట్టాడు. మరికొన్ని ఈఎంఐలు కట్టాల్సి ఉంది.  ఆర్థిక పరిస్థితుల కారణంగా మనోజ్ ఈఎంఐలు కట్టకపోవడంతో  ఏజెంట్లు బెదిరింపులకు దిగారు. 

మనోజ్ ఎంత చెప్పిన వినిపించుకోలేదు. రోజూ ఫోన్ చేస్తూ  వేధింపులకు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా మనోజ్ బంధువులకు, అతని స్నేహితులకు కుడా ఫోన్ చేశారు. దీంతో పరువు పోయిందని భావించిన మనోజ్  తీవ్ర మనస్తాపనికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. మనోజ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.  కుటుంబ సభ్యులకు విషయం తెలియజేయడంతో మనోజ్‌ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.  ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.