ఎకో, టెంపుల్ టూరిజం అభివృద్ధిపైనా దృష్టి
హెలీ టూరిజంపైనా ప్లాన్స్ రెడీ చేయాలి
అవసరమైన చోట పీపీపీ విధానం అమలు
స్పీడ్ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని బయట మరో జూపార్క్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇవాళ ఆయన స్పీడ్ ప్రాజెక్టులో భాగంగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పర్యాటకరంగ అభివృద్ధికి కొత్త పాలసీని రూపొందించాలని సూచించారు. అవసరమైన చోట పీపీపీ(పబ్లిక్, ప్రైవేటు పార్ట్ నర్ షిప్) పద్ధతిలో టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధి చేద్దామన్నారు.
ఇందుకోసం ఇతర రాష్ట్రాల్లోలని బెస్ట్ పాలసీలను అభివృద్ధి చేయాలని అన్నారు. ఎకో, టెంపుల్ టూరిజం అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. వీటితోపాటు హెల్త్ టూరిజాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నదని చెప్పారు. అవకాశం ఉన్న ప్రతి చోటా విహంగ వీక్షణానికి వీలుగా హెలీ టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.