అమితాబ్ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్న చిరంజీవి

అమితాబ్ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్న చిరంజీవి
  • చిరంజీవికి అక్కినేని జాతీయ అవార్డు ప్రదానం
  • హాజరైన అమితాబ్‌‌ బచ్చన్‌‌, టాలీవుడ్‌‌ ప్రముఖులు

హైదరాబాద్, వెలుగు: మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. సోమవారం హైదరాబాద్‌‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌‌లో ఈ కార్యక్రమం జరిగింది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని చిరంజీవి అందుకున్నారు. ఇప్పటివరకు తనకు ఎన్ని అవార్డులు వచ్చినా ఈ అవార్డు రావడం నిజమైన అచీవ్‌‌మెంట్‌‌గా భావిస్తున్నానని చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఆ కార్యక్రమంలో చిరంజీవి.. అమితాబ్ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు.

 ఇంట గెలిచి రచ్చ గెలవడం అనే నానుడికి భిన్నంగా తాను రచ్చ గెలిచాక ఇంట గెలిచానని ఆయన ఎమోషనల్ అయ్యారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, నాగార్జున కుటుంబ సభ్యులతో పాటు వెంకటేశ్‌‌, రాఘవేంద్రరావు, అశ్వినీదత్, సుబ్బిరామిరెడ్డి తదితర సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2024కు గాను చిరంజీవికి ఈ అవార్డును అందజేయనున్నట్టు అక్కినేని శతజయంతి సందర్భంగా గత నెల 20న నాగార్జున ప్రకటించారు.