టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వర రావు పేరు మీదుగా అందిస్తున్న ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్ 2024 వేడుకలు అట్టహాసంగా మొదలయ్యాయి. ఈ వేడుకలకి మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తోపాటూ టాలీవుడ్ సినీ పరిశ్రమకి చెందిన సినీ నిర్మాతలు, హీరోలు, డైరెక్టర్లు తదితరులు హాజరయ్యారు. అయితే ఈ అవార్డ్స్ ఫంక్షన్ లో అక్కినేని నాగేశ్వర రావు చివరగా ఐసీయూలో ఉండగా మాట్లాడిన మాటలను వినిపించారు.
ఇందులోభాగంగా "నా శ్రేయోభిలాషులందరూ నా పట్ల నా ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ద వహిస్తున్నారో నాకు బాగా తెలుసు. నా కుటుంభ సభ్యులు కూడా ఎప్పటికప్పుడు నా ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. దీంతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నాను. అలాగే నేను బాగున్నాను, రికవరీ అవుతున్నాను. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. త్వరలో హాస్పిటల్ నుంచి బయటికి వచ్చేస్తాను. అందరికీ అందుబాటులో ఉండటానికి ఆరోగ్యంగా తయారవ్యవడానికి సిద్దంగా ఉన్నాను. ఆరోగ్యం, సంతోషం ఇవే నా ఆస్తి. మీ ఆశీర్వాదాల వల్లే ఇలా ఉన్నాను. అలాగే మరో కొనేళ్ళు ఆరోగ్యంగా జీవించగలననే నమ్మకం, విశ్వాసం నాలో ఉంది. అది అలాగే కొనసాగాలని, నా ఆప్తులందరూ సంతోషంగా ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. సెలవు. మీ ఆశీర్వాదమే నాకు ముఖ్యం" అని చివరి మెసేజ్ లో పేర్కొన్నారు. ఆ తర్వాత 2014లో జనవరి 22న తుది శ్వాస విడిచారు.
ALSO READ | ఇన్స్టాగ్రామ్ లో మాజీ భార్యతో దిగిన చివరి ఫోటోని డిలీట్ చేసిన నాగ చైతన్య..
ఈ విషయం ఇలా ఉండగా నటుడు అక్కినేని నాగేశ్వర రావు తెలుగు, తమిళ్, హిందీ తదితర భాషలలో కలిపి 100 కి పైగా సినిమాల్లో నటించాడు. చివరగా హీరో నాగార్జున నటించిన మనం సినిమాలో కనిపించాడు.