ఐపీఎల్ లో నేడు(మార్చి 28) మరో ఆసక్తికర సమరం జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడుతుంది. జైపూర్ వేదికగా సవాయి మాన్ సింగ్ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. ఇప్పటివరకు ఇరు జట్లు ఒకటే మ్యాచ్ ఆడాయి. తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జయింట్స్ పై ఘన విఅజయ్మ్ సాధిస్తే.. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ చేతిలో ఓడింది. సొంతగడ్డపై రాజస్థాన్ ఈ మ్యాచ్ లో గెలిచి వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తే.. ఢిల్లీ ఎలాగైనా బోణీ కొట్టాలని చూస్తుంది.
Also Read :వారెవ్వా ఉప్పల్ మ్యాచ్.. ఒక్క మ్యాచ్‌తో నాలుగు ఆల్‌టైం రికార్డ్స్ బ్రేక్
నోకియా వచ్చేశాడు
పంజాబ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో ఢిల్లీ బౌలింగ్ బలహీనంగా కనిపించింది. కుల్దీప్ యాదవ్ మినహాయిస్తే మిగిలిన వారెవరూ ప్రభావం చూపించలేదు. ఒక్క బౌలర్ కూడా విదేశీ ప్లేయర్ లేకపోవడంతో ఆ జట్టు ఓటమిపై ప్రభావం చూపించింది. నేడు రాజస్థాన్ తో జరగనున్న మ్యాచ్ లో సౌతాఫ్రికా పేస్ బౌలర్ అన్రిచ్ నోకియా తుది జట్టులో ఆడటం దాదాపుగా ఖాయమైంది. తొలి మ్యాచ్ కు దూరమైన ఈ సఫారీ పేసర్.. నిన్న ఢిల్లీ జట్టులో చేరాడు. నోకియా జట్టులోకి వస్తే హోప్, స్టబ్స్ లలో ఒకరు బెంచ్ మీద కూర్చునే అవకావం ఉంది. ఈ ఒక్క మార్పు మినహా ఢిల్లీ ఎలాంటి మార్పులు చేసే అవకాశం కనిపించడం లేదు.
పరాగ్ కు గాయం
తొలి మ్యాచ్ లో గెలిచి ఊపు మీద రాజస్థాన్ రాయల్స్ జట్టుకు పరాగ్ గాయం ఆందోళనకు గురి చేస్తుంది. లక్నోతో మ్యాచ్ సందర్భంగా 29 బంతుల్లో 43 పరుగులు చేసి ఈ యువ ప్లేయర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్ కోచ్ సంగక్కర అతడు మ్యాచ్ సమయానికి అందుబాటులో ఉంటాడని ధీమా వ్యక్తం చేశాడు. ఒకవేళ పరాగ్ ఈ మ్యాచ్ లో ఆడకపోతే అతని స్థానంలో శివమ్ దూబేకు అవకాశం దక్కొచ్చు. సొంతగడ్డపై మ్యాచ్ జరుగుతుండడంతో ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది.
రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు అంచనా:
జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ.
ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు అంచనా :
డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, షాయ్ హోప్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్, కెప్టెన్), రికీ భుయ్, అక్షర్ పటేల్, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ, సుమిత్ కుమార్.
Anrich Nortje Joined DC camp in Jaipur pic.twitter.com/h1fMeb8mRm
— Abxd (@ABXD_DC) March 25, 2024