క్రికెట్ చరిత్రలో చోకర్స్ గా పేరున్న జట్టు ఏదైనా ఉందంటే అందరూ ముక్త కంఠంగా చెప్పే పేరు దక్షిణాఫ్రికా. స్టార్ ప్లేయర్లు ఎంతమంది ఉన్నా.. ఇప్పటివరకు ఆ జట్టు ఖాతాలో ఒక్క ఐసీసీ టోర్నీ కూడా లేదు. ప్రతిసారి నాకౌట్ మ్యాచులకి రావడం, దురదృష్టం కారణంగా వెనుదిరగడం దక్షిణాఫ్రికా జట్టుకి ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ సారి భారత్ లో జరగనున్న వరల్డ్ కప్ కోసం కుర్రాళ్లతో పటిష్టంగా కనబడుతున్నా.. తాజాగా ఇద్దరు కీలక ప్లేయర్లు గాయం కారణంగా వరల్డ్ కప్ కి దూరమయ్యారు.
నోర్జే, సిసంద మగల ఔట్
వరల్డ్ కప్ కి దక్షిణాఫ్రికాకు బిగ్ షాక్. ఆ జట్టు స్టార్ బౌలర్ అన్రిచ్ నోర్జేతో పాటు సిసంద మగల గాయాలతో వరల్డ్ కప్‌కు పూర్తిగా దూరమయ్యారు. వరల్డ్ కప్ సమయానికి ఈ ఇద్దరు గాయపడంతో ఇప్పుడు ఆ జట్టుకి పెద్ద ఎదురు దెబ్బ తగలనుంది. ఇటీవలే ఆస్ట్రేలియాతో సిరీస్ లో నోర్జే తీవ్రంగా గాయపడగా.. నొప్పి తీవ్రంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. మరో వైపు యువ పేసర్ మోకాలి నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. వీరి స్థానాల్లో ఫహుల్క్ వాయో, లిజార్డ్ విలియమ్స్ వచ్చి చేరారు.
ALSO READ : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు: చంద్రబాబు బెయిల్ పిటిషన్ సెప్టెంబర్ 26కి వాయిదా..
? #CWC23 TEAM UPDATE ?
— Proteas Men (@ProteasMenCSA) September 21, 2023
White-ball head coach Rob Walter today confirmed that Anrich Nortje & Sisanda Magala have been ruled out of the @cricketworldcup in India ???
✅ Andile Phehlukwayo & Lizaad Williams
❌Sisanda Magala & Anrich Nortje #BePartOfIt pic.twitter.com/WhDiCNDNjY