ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌లో అన్షుకు గాయం!..ఇండియా రెజ్లింగ్‌‌‌‌‌‌‌‌కు ఎదురుదెబ్బ

ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌లో అన్షుకు గాయం!..ఇండియా రెజ్లింగ్‌‌‌‌‌‌‌‌కు ఎదురుదెబ్బ

న్యూఢిల్లీ : పారిస్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌కు ముందు ఇండియా రెజ్లింగ్‌‌‌‌‌‌‌‌కు ఎదురుదెబ్బ తగిలింది. కచ్చితంగా మెడల్‌‌‌‌‌‌‌‌ గెలిచే అవకాశాలున్న స్టార్‌‌‌‌‌‌‌‌ రెజ్లర్‌‌‌‌‌‌‌‌ అన్షు మాలిక్‌‌‌‌‌‌‌‌ (57 కేజీ) ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌లో గాయపడింది. ఆమె భుజానికి గాయమైనట్లు తేలింది. అయితే తక్షణమే గాయం తీవ్రతకు సంబంధించిన నివేదిక ఇవ్వాలని డబ్ల్యూఎఫ్‌‌‌‌‌‌‌‌ఐ ఆదేశించింది. ఆసియా ఒలింపిక్‌‌‌‌‌‌‌‌ క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌లో గోల్డ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌ నెగ్గడం ద్వారా అన్షు ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌కు అర్హత సాధించింది.

‘ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌లో ఒక్కసారి అన్షు భుజం నొప్పితో ఇబ్బందిపడింది. వెంటనే ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌ ఆపేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం. అయినా నొప్పి తగ్గకపోవడంతో ఎంఆర్‌‌‌‌‌‌‌‌ఐ తీయించాం. ఇందులో గాయం తీవ్రంగా లేదని తేలింది. కానీ నొప్పి ఇంకా తగ్గలేదు. రెండు రోజుల తర్వాత మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెడుతుంది. ఆ టైమ్‌‌‌‌‌‌‌‌లోగా పరిస్థితిపై ఓ అంచనాకు వస్తాం’ అని అన్షు తండ్రి, కోచ్‌‌‌‌‌‌‌‌ ధర్మవీర్‌‌‌‌‌‌‌‌ మాలిక్‌‌‌‌‌‌‌‌ వెల్లడించాడు.