న్యూఢిల్లీ: యంట్ఫిన్ సింగపూర్ జొమాటోలో 408 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.3,356 కోట్లు) విలువైన షేర్లను బ్లాక్ డీల్ ద్వారా అమ్మనుందని ఇంగ్లీష్ మీడియా రిపోర్ట్ చేసింది. ఒక్కో షేరుకు రూ. 251.68 ఫ్లోర్ ధరకు విక్రయించే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం దీనికి జొమాటోలో 4.3శాతం వాటా ఉంది.
ఎన్ఎస్ఈలో సోమవారం ముగింపు ధర రూ. 263.24 కంటే 4.6శాతం తగ్గింపుతో షేర్లు అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. సోమవారం జోమాటో షేర్లు జీవితకాల గరిష్ఠ స్థాయి రూ. 280.90కి చేరాయి. జొమాటోకు జూన్ క్వార్టర్లో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం ఏడాది ప్రాతిపదికన 74శాతం పెరిగి రూ.4,206 కోట్లకు చేరుకుంది. 2024 క్యాలెండర్ సంవత్సరంలో జొమాటో షేర్లు ఇప్పటివరకు రెండింతలు పెరిగాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 2.5 లక్షల కోట్ల మార్కుకు చేరుకుంది.