చాట్ జీపీటీ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ప్రపంచంలోని ఐటీ రంగం మొత్తం అల్లకల్లోలం అయ్యింది. ఇంకా పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాకుండానే.. చాట్ జీపీటీకి పోటీగా వచ్చిన క్లాడ్ 2 టెక్నాలజీ ఇప్పుడు సరికొత్త విప్లవం సృష్టిస్తుంది. ఇంకా ఇండియాలోకి రాని ఈ క్లాడ్ 2 టెక్నాలజీ.. అమెరికా, యూరప్ దేశాల్లో ఇప్పుడిప్పుడే వినియోగిస్తున్నారు. ఇది చాట్ జీపీటీ కంటే చాలా బాగుందనే టాక్ రావటంతో.. ఐటీ రంగం ఆసక్తిగా గమనిస్తుంది.
చాట్ జీపీటీకి పోటీ అయిన ఈ Claude 2 ని (క్లాడ్ 2) యాంత్రోపిక్ అనే AI కంపెనీ రిలీజ్ చేసింది. ప్రస్త్తుతం ఈ టూల్ అమెరికా, ఇంగ్లాండ్ దేశాల్లోనే అందుబాటులో ఉంది. ఇండియాలో ఉపయోగించుకోవాలి అంటే VPN ద్వారా దీన్ని వాడుకోవచ్చు.
క్లాడ్ 2 (claude 2) ఫీచర్స్ పరిశీలిస్తే.. చాట్ జీపీటీ (Chat-gpt) ఎలా పని చేస్తుందో సేమ్ టూ సేమ్ అలాగే పని చేస్తుంది. చాట్ జీపీటీ కంటే కంటే పవర్ ఫుల్ అంటున్నారు డెవలపర్స్. చాట్ జీపీటీ (Chat-Gpt) కేవలం 2021 వరకు ఉన్న డేటా మాత్రమే ఉంటే.. క్లాడ్ 2 (Claud 2) మాత్రం 2023 వరకు ఉన్న డేటాపై అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది.
క్లాడ్ 2 ఏఐ టూల్.. మనం ఏ ప్రశ్న అడిగినా.. దానికి సమాధానం చెబుతుంది. అంతే కాదు.. డైరెక్ట్ గా ఫైల్స్ అప్ లోడ్ చేస్తే.. వాటిని అనాలసిస్ చేసి రిపోర్టు కూడా ఇస్తుంది. రిపోర్టు డేటాను ఏ విధంగా కావాలంటే.. ఆ విధంగా.. విడివిడిగా ఇవ్వటం క్లాడ్ 2 టెక్నాలజీ ప్రత్యేకత. చాట్ జీపీటీ కంటే మెరుగ్గా.. కోడింగ్ కు సంబంధించిన ఆన్సర్స్ ఇస్తుందని చెబుతున్నారు ఐటీ నిపుణులు.
చాట్ జీపీటీ (Chat gpt) కేవలం 25 వేల పదాలను మాత్రమే విశ్లేషించగలదు. క్లాడ్ 2 (claude 2) మాత్రం 75 వేల పదాల వరకు సపోర్ట్ చేయటం విశేషం. ఇక సాంకేతికంగా పరిశీలిస్తే.. ఇది ఒక లక్ష టోకెన్స్ ను సపోర్ట్ చేస్తుంది అంటున్నారు డెవలపర్స్. క్లాడ్ 2 ఫుల్ వెర్షన్.. కమర్షియల్ గా మార్కెట్ లోకి వస్తే.. చాట్ జీపీటీతోపాటు.. మిగతా అన్ని AI మోడల్స్ లో ఇదే టాప్ అవుతుందని భావిస్తున్నారు ఐటీ రంగ నిపుణులు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న చాట్ జీపీటీ కేవలం 8 వేల టోకెన్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అలాగే 32K టోకెన్ సపోర్ట్ వెర్షన్ ను సెపరేట్ గా ఆఫర్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే AI టిల్స్ మనం అడిగే ప్రశ్నల్లో.. ప్రతి పదాన్ని కొన్ని టోకెన్స్ గా విభజించి.. విశ్లేషించి సమాధానాలు ఇస్తుంది. ఎన్ని ఎక్కువ టోకెన్స్ ఉపయోగిస్తే.. అంత కచ్చితత్వంతో సమాధానాలు ఇస్తుందన్న మాట.
చాట్ జీపీటీ, క్లాడ్ 2 ధరల విషయాన్ని పరిశీలిస్తే.. చాట్ జీపీటీ కంటే.. క్లాడ్ 2 టెక్నాలజీ 50 శాతంతక్కువగానే ఉంటుందని కంపెనీ చెబుతుంది. ప్రస్తుతం ఇది అమెరికా, ఇంగ్లాండ్ దేశాల్లో మాత్రమే బీటా వెర్షన్ లో ఉచితంగా వాడుకుంటున్నారు. మార్కెట్ లో ఇప్పటికే కొన్ని వేల AI టూల్స్ ఉన్నాయి. ప్రతి వారం కొన్ని వందల కొత్త టూల్స్ రిలీజ్ అవుతున్నాయి. సో వాటి గురించి తెలుసుకోవడం, అప్ డేట్ అవడం చాలా ముఖ్యం.
రాబోయే రోజుల్లో AI ఉపయోగించే వారే ముందు ఉంటారనేది ఇప్పటికే ప్రపంచం గుర్తించింది. సో మీరు కూడా ఆ దిశగా అడుగులు వేయండి. ఆల్ ద బెస్ట్..