ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించాలి

ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించాలి
  • ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి

ముషీరాబాద్, వెలుగు: మాలలంతా ఏకమై ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిద్దామని జాతీయ షెడ్యూల్డ్​కులాల హక్కుల పరిరక్షణ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి హైదరాబాద్ జిల్లా చైర్మన్ రాజు వస్తాద్ పిలుపునిచ్చారు. వర్గీకరణకు వ్యతిరేకంగా డిసెంబరు1న జింఖానా గ్రౌండ్​లో తలపెట్టిన మాలల భారీ బహిరంగ సభను సక్సెస్​చేయాలని కోరారు. 

ఈ మేరకు బుధవారం ఆయన చింతల్ బస్తీ, అరుంధతి నగర్ తదితర బస్తీల్లో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మహిళా నాయకురాలు రుక్మిణి ఆధ్వర్యంలో బస్తీబాట కార్యక్రమం నిర్వహించారు. రాజు వస్తాద్ మాట్లాడుతూ ఎస్సీల మధ్య చిచ్చుపెట్టి బీజేపీ నాయకులు తమాషా చూస్తున్నారని విమర్శించారు. మాలలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.