కొవిడ్ లక్షణాలున్నోళ్లను గుర్తించండి
హైదరాబాద్, వెలుగు: కరోనా వైరస్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై జీహెచ్ఎంసీ, స్కూల్ ఎడ్యుకేషన్, హోం శాఖ, ఐ అండ్ పీఆర్, టూరిజం, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని బస్ స్టాప్‌లు, రైల్వే.. మెట్రో స్టేషన్లు, పబ్లిక్ ప్లేసుల్లో హోర్డింగులపై కరోనా నివారణపై ప్రచారం చేయాలని, ఈ పనులన్నీ శుక్రవారం రాత్రిలోగా పూర్తి చేయాలని సూచించింది. జోన్‌కు ఒక నోడల్ ఆఫీసర్‌ను నియమించి క్షేత్ర స్థాయి సిబ్బందితో రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ సిబ్బంది ఇంటింటికీ తిరిగి కరోనా లక్షణాలున్నవారిని గుర్తించాలని పేర్కొంది. ఈ టీమ్‌లు హోం ఐసోలేషన్‌లో ఉన్న వారిని 14 నుంచి 28 రోజులపాటు పర్యవేక్షించాలని చెప్పింది. స్కూళ్లలో ప్రేయర్ టైంలోనే పిల్లలకు కరోనా వైరస్ వ్యాప్తి గురించి అవగాహన కల్పించాలని, అన్ని సోమవారాల్లో ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని విద్యాశాఖకు సూచించింది. విదేశీ టూరిస్టులను గుర్తించి వివరాలను డీఎంహెచ్ఓకు అందజేయాలని టూరిజం అధికారులకు సూచించింది.
For More News..