
అమెరికాలో ఎలాన్ మస్క్ గట్టి ఎదురు దెబ్బ. మస్క్ కంపెనీల ఉత్పత్తులను బహిష్కరించాలని అమెరికావ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. శనివారం (మార్చి1) వాషింగ్టన్ లో మస్క్ కంపెనీల దగ్గర భారీ ఎత్తున నిరసనకారులు ఆందోళన చేపట్టారు. టెస్లా ఉత్పత్తులు, ఎలక్ట్రిక్ వాహనాలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య వ్యాపార సంబంధాల కారణంగా DOGE ని తీసుకొచ్చారు, ఇది అమెరికా ప్రజలకు వ్యతిరేకం.. డాగీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Mass arrests at an anti-Elon protest after protesters invaded a Tesla dealership in NYC
🎥 @ScooterCasterNY pic.twitter.com/AfVMcm1xa3
— Libs of TikTok (@libsoftiktok) March 1, 2025
స్థానిక మీడియా ప్రకారం.. టక్సన్, సెయింట్ లూయిస్, న్యూయార్క్ నగరం, డేటన్, షార్లెట్, పాలో ఆల్టోతో సహా 50 కి పైగా US నగరాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. మార్చిలో ఇంగ్లాండ్, స్పెయిన్ ,పోర్చుగల్‌లలో కూడా నిరసనలు వ్యక్తం చేయనున్నారు. టెస్లా టేక్‌డౌన్ అనే వెబ్సైట్ ఉత్తర అమెరికా , యూరప్ అంతటా ఈ ఆందోళనలు నిర్వహించనున్నారు.