డ్రగ్స్​రహిత జిల్లాగా మార్చుకుందాం : డీసీపీ రాజమహేంద్ర నాయక్

డ్రగ్స్​రహిత జిల్లాగా మార్చుకుందాం : డీసీపీ రాజమహేంద్ర నాయక్

జనగామ అర్బన్, వెలుగు : కొత్త ఏడాదిలో జనగామ జిల్లాను డ్రగ్స్​రహిత జిల్లాగా తీర్చిదిద్దుకుందామని డీసీపీ రాజమహేంద్ర నాయక్​అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంటలో కేఎన్​ఆర్​ సైక్లింగ్​ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్​అవేర్నెస్  2 కే రన్, సైక్లింగ్ ​ర్యాలీని వెస్ట్​జోన్ ​డీసీపీ హాజరై జెండా ఊపి ప్రారంభించారు. డ్రగ్స్​నిర్మూలన కోసం పాటుపడతామని యువతతో ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ డ్రగ్స్​నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. 2 కే రన్, సైక్లింగ్​లో ప్రతిభ కనబర్చిన వారికి మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఏసీపీ కె.పార్థసారథి, సీఐ దామోదర్​రెడ్డి, ఎస్సైలు చెన్నకేశవులు, రాజేశ్​కుమార్, ఎం.భరత్, ఎం.స్వేత, పోలీస్​సిబ్బంది, విద్యార్థులు, యువత తదితరులు పాల్గొన్నారు.