కెనడాలోని బ్రాంప్టన్ లో హిందూదేవాలయంపై ఆదివారం ( నవంబర్ 10) దాడి జరిగింది. కెనడాలోని బ్రాంప్టన్‌లో ఖలిస్తానీలు ప్రముఖ హిందూ దేవాలయంపై దాడి చేశారు. కెనడా పోలీసు అధికారులు కూడా ఈ దాడిలో పాల్గొన్నారు. ఈ ఘటనతో కెనడాలో హిందువుల భద్రతపై ఆందోళన నెలకొంది.
#WATCH | Delhi: People of the Hindu Sikh Global Forum on their way to the High Commission of Canada, Chanakyapuri, to protest against the attack on a Hindu Temple in Canada, were stopped at Teen Murti Marg by Police. pic.twitter.com/ONaXu46gJi
— ANI (@ANI) November 10, 2024
అయితే ఆలయంపై తర్వాత కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసనలు చెలరేగాయి. ఈ నిసరనలో హిందువులు, సిక్కులు ఏకమై కెనడా రాయబార కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు.
సిక్కులు, హిందువులపై దాడి చేయలేదని అది తెలిపేందుకే హిందూ, సక్కులు ఏకమై నిరసన తెలుపుతున్నామని సిక్కు గ్లోబల్ ఫ్లోరమ్ సభ్యులు ఒకరు తెలిపారు. కెనడా హైకమిషన్ ఉన్న చాణక్య పురికి నిరసన కారులు వెళ్తుండగా వారిని ఢిల్లీ పోలీసులు తీన్ మూర్తి మార్గ్ వద్ద అడ్డుకున్నారు.