- హోటళ్లు, లాడ్జీలు, ట్రయల్ రూమ్స్‌లో తనిఖీలు చేయనున్న ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్
- షీ టీమ్స్తో కలిసి బగ్డిటెక్టర్లతో చెకింగ్
- 2 వేల మందికి ట్రైనింగ్
- స్పై కెమెరా ఫ్రీ సర్టిఫికెట్ఇస్తేనే వ్యాపారం
- షీ టీమ్స్తో కలిసి బగ్డిటెక్టర్లతో చెకింగ్
హైదరాబాద్, వెలుగు: మహానగరంలో మహిళలను స్పై కెమెరాలు వెంటాడుతున్నాయి. స్టార్‌హోటల్స్, లాడ్జీలు, షాపింగ్ మాల్స్ లోని ట్రయల్ రూమ్స్, పబ్స్, లేడీస్ హాస్టల్స్, హాస్పిటల్స్‌లోని ఎక్స్ రే, స్కానింగ్ సెంటర్స్, టూరిస్ట్ ఏరియాల్లోని రెస్ట్ రూమ్స్ సహా ఎక్కడ పడితే అక్కడ స్పై, హిడెన్కెమెరాలు పెట్టి వీడియోలు తీసి వాటితో బ్లాక్మెయిల్చేస్తున్నారు. కొందరు ఆగంతకులు వీటిని పోర్న్సైట్స్కు అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
గత ఆగస్టులో శంషాబాద్ సిటా గ్రాండ్‌హోటల్ బెడ్రూమ్లో ఓ జంట ఏకాంతంగా ఉండగా రహస్య కెమెరాలతో వీడియోలు తీసి తర్వాత డబ్బుల కోసం బ్లాక్మెయిల్చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడి మొబైల్‌ను తనిఖీ చేయగా పదుల సంఖ్యలో వీడియోలు బయటపడ్డాయి. దీంతో ఇలాంటివి రిపీట్‌కాకుండా ఉండడనికి పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదే అంశంపై పోలీస్ ఉన్నతాధికారులు, విద్యాశాఖ అధికారులతో సమావేశమై ఒక ప్లాన్రూపొందించారు.
బగ్ డిటెక్టర్లతో చెక్ చేస్తరు
మహిళలు సీక్రెట్ కెమెరాల బారిన పడకుండా ‘యాంటీ రెడ్ ఐ’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా 2000 మంది నేషనల్ సర్వీస్ స్కీం (ఎన్‌ఎస్‌ఎస్) విద్యార్థులను ఎంపిక చేసి ట్రైనింగ్ ఇస్తున్నారు. కాలేజీ యువతులు సహా పలు స్వచ్ఛంద సంస్థల్లో పనిచేస్తున్న సామాజిక కార్యకర్తలను తీసుకుంటున్నారు. వీరు షీ టీమ్స్తో కలిసి స్పై, హిడ్డెన్కెమెరాల పని పడతారు.
ఇందులో భాగంగా ముందు షాపింగ్ మాల్స్‌లోని ట్రయల్ రూమ్స్ సహా అత్యవసర పరిస్థితుల్లో మహిళలు అవసరాలు తీర్చుకునే ప్రాంతాలు, సీక్రెట్కెమెరాల భారిప పడే అవకాశమున్న ప్రాంతాలను గుర్తిస్తున్నారు. తర్వాత అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన పోర్టబుల్బగ్ డిటెక్టర్లతో ఆయా ప్రదేశాలను తనిఖీలు చేయనున్నారు. బగ్ డిటెక్టర్లను ఎలా ఉపయోగించాలన్న దానిపై ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్‌కు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. హోటల్స్, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, లాడ్జీల నిర్వాహకులతో ఇప్పటికే పోలీసులు పలుమార్లు సమావేశాలు ని
ర్వహించారు.
సేఫ్ జోన్లలో ‘స్పై కెమెరా ఫ్రీ’ స్టిక్కర్
బగ్ డిటెక్టర్‌తో తనిఖీలు చేసిన తర్వాత స్పై కెమెరాలు లేవని తేలితే అక్కడ ‘స్పై కెమెరా ఫ్రీ’ పేరుతో ప్రత్యేకంగా రూపొందించిన స్టిక్కర్లను అంటిస్తారు. ఒకవేళ ఏదైనా రూమ్‌లో సీసీటీవీ కెమెరాలు సహా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కనిపిస్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇస్తారు. అలాగే తనిఖీలు నిర్వహించిన ప్రాంతాల్లో షీ టీమ్స్ ఫోన్ నంబర్స్‌తో పాటు మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో వాల్ పోస్టర్స్ అంటిస్తారు. ఇలా చేయడం వల్ల మహిళలకు స్పై కెమెరాలపై అవగాహన వస్తుందని చెప్తున్నారు.
మహిళలకు సూచనలివీ..
మహిళలు టూరిస్ట్ స్పాట్స్ సహా రెస్టారెంట్స్ వాష్‌రూమ్స్, హోటల్రూమ్స్, మాల్స్‌లో ట్రయల్రూమ్స్కు వెళ్లినప్పుడు పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి గోడలు, స్విచ్ బోర్డులు, చిన్న రంద్రాలు, నల్లని డాట్స్ వంటివి ఉన్నాయమో చెక్చేయాలి. స్పై కెమెరాలను ఎక్కువగా స్మోక్ డిటెక్టర్లు, ఎయిర్ పిల్లర్లు, ఏసీలు, వాల్ పెయింటింగ్స్, పుస్తకాలు,కొన్ని అలంకరణ వస్తువుల్లో అమర్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని ముందుగా తనిఖీ చేయాలి. ఏ మాత్రం అనుమానం వచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. హిడ్డెన్కెమెరాలు, స్పై కెమెరాలు గుర్తించడం ఎలా అన్నదానిపై చాలామంది యూట్యూబ్‌లో వీడియోలు చేశారు. వాటిని చూసినా కూడా అవగాహన వస్తుంది.