డ్రగ్స్ రహిత సమాజన్ని నిర్మిద్దాం

డ్రగ్స్ రహిత సమాజన్ని నిర్మిద్దాం
  • నారాయణ పేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ 

కోస్గి, వెలుగు : డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు యువత పాటుపడాలని ఉజ్వల భవిష్యత్ కోసం  బాటలు వేసుకోవాలని  నారాయణ పేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, జిల్లా ఎస్పీ యోగేశ్ గౌతమ్  పిలుపునిచ్చారు.  మంగళవారం నారాయణపేట జిల్లాలోని కోస్గి పట్టణంలోని స్టేడియం గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ..  

ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతినెల జిల్లా కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో  డ్రగ్స్ నివారణపై జిల్లా స్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. యాంటీ డ్రగ్స్ కార్యక్రమాల్లో భాగంగానే జిల్లాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, మొదటగా కోస్గిలోనే ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు.  జిల్లాలోని అన్ని కళాశాలలో యాంటీ డ్రగ్స్ క్లబ్ లు సమర్థవంతంగా పనిచేయాలని కలెక్టర్ సూచించారు. నారాయణపేట జిల్లాతో పాటు, కొడంగల్ నియోజకవర్గాన్ని డ్రగ్స్ నిషేధిత ప్రాంతాలుగా మార్చేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఆమె కోరారు.

డ్రగ్స్ సమాచారం తెలిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 14446 కి సమాచారం ఇవ్వాలని తెలిపారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయకుమార్, డీఆర్డీవో మొగులప్ప, కోస్గి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు మాట్లాడుతూ.. డ్రగ్స్  వాడటం వల్ల కలిగే నష్టాలను వివరించారు. మాదకద్రవ్యాలు నిరోధం(సే నో  టు డ్రగ్స్)పై విద్యార్థుల అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్, ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక శివాజీ చౌక్ నుంచి రామాలయం వరకు కలెక్టర్, ఎస్పీ విద్యార్థులతో  కలిసి ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

కార్యక్రమంలో కోస్గి సీఐ దస్రు నాయక్, ఎస్ఐ బాల్ రాజ్, తహసీల్దార్ బక్క శ్రీనివాసులు, మార్కెట్ చైర్మన్ భీమప్ప, వైస్ చైర్మన్ గిరి ప్రసాద్ రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు భీమ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రఘు వర్ధన్ రెడ్డి, ఎంపీడీవో శ్రీధర్, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.