ట్రంప్, ఎలాన్ మస్క్కు వ్యతిరేకంగా..అమెరికావ్యాప్తంగా నిరసనలు

ట్రంప్, ఎలాన్ మస్క్కు వ్యతిరేకంగా..అమెరికావ్యాప్తంగా నిరసనలు
  • అమెరికాలోని 50 రాష్ట్రాల్లో హోరెత్తిన నిరసనలు
  • వాషింగ్టన్ నేషనల్ మాల్ పార్క్ లో వేలాది మంది నిరసన కారుల ఆందోళన
  • ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత అతిపెద్ద మాసివ్ ప్రొటెస్ట్
  • ప్రభుత్వ కోతలు, వలసల కఠిన చర్యలు, సుంకాలకు వ్యతిరేకంగా నిరసనలు 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, బిలియనీర్ ఎలాన్ మస్క్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్నాయి. శనివారం (ఏప్రిల్5)న వాషింగ్టన్ డిసితో సహా యుఎస్ అంతటా వేలాది మంది నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. సర్వ్ పీపుల్ నాట్ ప్రాఫిట్.. స్టాట్ ట్రంప్.. స్టాఫ్ మస్క్..అంటూ ప్లకార్టులు ప్రదర్శించారు. 

ప్రభుత్వ కోతలు, వలసల కఠిన చర్యలు, సుంకాలను వ్యతిరేకిస్తూ నిరసనకారులు ట్రంప్, ఎలాన్ మస్క్ లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జనవరిలో ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత భారీ ఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చి ట్రంప్ పాలనను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలపడం ఇదే మొదటిసారి. అమెరికానిలోని 50రాష్ట్రాల్లో నిరసనలతో ఆందోళన కారులు హోరెత్తించారు. ట్రంప్ పాలనను వ్యతిరేకిస్తూ అమెరికాతోపాటు ఇతర దేశాల్లో కూడా నిరసనలు వెల్లువెత్తున్నాయి.