యాంటీ బయోటిక్స్ వాడకంపై అవేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్

పద్మారావునగర్, వెలుగు:  అధికంగా యాంటీ బయోటిక్స్ వాడటం ప్రమాదకరమని గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కే. ఇందిరా అన్నారు. మంగళవారం గాంధీ మెడికల్ ​కాలేజీ మైక్రో బయోలజీ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో వరల్డ్​ ఏఎంఆర్​ అవేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్ వీక్ సందర్భంగా యాంటీ బయోటిక్స్  మందుల వాడకంపై డాక్టర్లు గాంధీ ఆవరణలో అవేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్ ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ల ప్రిస్కిప్షన్​ లేకుండా యాంటీ బయోటిక్స్​వాడకం వల్ల రెసిస్టెన్స్​సమస్యలు ఏర్పడి,  భవిష్యత్తులో మెడిసన్స్​బాడీలో పనిచేయకుండా పోతాయన్నారు.  ‘యూజ్​రైట్​డ్రగ్, రైట్​డోస్, రైట్​టైమ్​’ అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో గాంధీ సూపరింటెండెంట్​ప్రొఫెసర్​ రాజకుమారి, మైక్రో బయాలజీ హెచ్ఓడీ ప్రొఫెసర్​ సురేఖ, వైస్​ ప్రిన్సిపాల్​ డా. రవిశేఖర్​ రావు, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంవోవన్ శేషాద్రి, ఇన్​ఫెక్షన్​ కంట్రోల్​ఆఫీసర్​ డాక్టర్​ పూజ, ఎంపీహెచ్​ఓ వేణుగోపాల్​ గౌడ్​, డాక్టర్లు, మెడికోలు, నర్సింగ్​ సిబ్బంది పాల్గొన్నారు.