సూర్యాపేట పర్యటన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల నేతలను ముందస్తు అరెస్టులు

సూర్యాపేట, వెలుగు:  ఐటీ మంత్రి కేటీఆర్ సూర్యాపేట పర్యటన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.  సోమవారం ఉదయమే కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ, ప్రజా పంథా నాయకులను అదుపులోకి తీసుకొని  సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సమస్యల పరిష్కరించాలని సమ్మె చేస్తున్న అంగన్ వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన కార్మికులను పట్టించుకోని సర్కారు ఎన్నికలు సమీపిస్తుండడంతో పనుల పేరిట హడావుడి చేస్తోందని మండిపడ్డారు.

  వీరితో పాటు మున్సిపల్, గ్రామ పంచాయతీ, వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు,  ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారన్నారు. సమస్యలపై ప్రశ్నిస్తున్నందునే తమను అరెస్టుల పేరిట ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.