జెత్వానీ కేసులో.. ముగ్గురు ఐపీఎస్ అధికారులకు ముందస్తు బెయిల్

జెత్వానీ కేసులో.. ముగ్గురు ఐపీఎస్ అధికారులకు ముందస్తు బెయిల్

ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్‎లకు భారీ ఊరట దక్కింది. ఐపీఎస్ ఆఫీసర్స్ పీఎస్సార్ ఆంజనేయులు, కాంతి రాణా, గున్నీలకు ఆంధ్రప్రదేశ్ హై కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వీరితో పాటు ఇబ్రహీంపట్నం మాజీ సీఐ హనుమంతరావు, అడ్వొకేట్ వెంకటేశ్వర్లుకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ 2025, జనవరి 7వ తేదీన హై కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 

కాగా, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పెద్దల అండతో పోలీసులు తనను, తన ఫ్యామిలీ మెంబర్స్‎ను వేధింపులకు గురి చేశారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నటి జెత్వానీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముంబై నుండి ఏపీకి తీసుకొచ్చిన పోలీసులు ఓ గెస్ట్ హౌస్‎లో బంధించి వేధింపులకు గురి చేశారని ఆరోపించింది. జెత్వానీ కేసును సీరియస్‎గా తీసుకున్న ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 

ALSO READ | Jaahnavi Kandula: భారత విద్యార్థిని చంపిన అమెరికా పోలీస్ ఉద్యోగం పీకేశారు

జెత్వానీ ఫిర్యాదు మేరకు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‎తో పాటు ఐపీఎస్ ఆఫీసర్స్ పీఎస్సార్ ఆంజనేయులు, కాంతి రాణా, గున్నీ, ఇబ్రహీంపట్నం మాజీ సీఐ హనుమంతరావు, అడ్వొకేట్ వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేశారు. దీంతో వీరు హై కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఇరు వర్గాల వాదనలు విన్న హై కోర్టు.. వీరికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు ఈ ముగ్గురు ఐపీఎస్‎లను ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.